AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: చంద్రబాబు రాజ్యసభ వ్యూహం… అదిరింది బాబూ !

అనూహ్యంగా వ్యూహాలు రచించి రాజకీయాలను రక్తికట్టించే టీడీపీ చంద్రబాబు మళ్లీ చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ రాజ్యసభ ఎన్నికల బరిలోకి అనూహ్యంగా దిగడం వెనుక చంద్రబాబు స్పెషల్ వ్యూహం దాగున్నట్లు తెలుస్తోంది. గెలిచే పరిస్థితి లేకపోయినా బరిలోకి దిగడం వెనుక బాబు వ్యూహం ఇదేనంటూ ఓ థియరీ చర్చల్లోకి వచ్చింది.

Chandrababu: చంద్రబాబు రాజ్యసభ వ్యూహం... అదిరింది బాబూ !
Rajesh Sharma
|

Updated on: Mar 12, 2020 | 5:14 PM

Share

Chandrababu strategy for Rajyasabha polls: అనూహ్యంగా వ్యూహాలు రచించి రాజకీయాలను రక్తికట్టించే టీడీపీ చంద్రబాబు మళ్లీ చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ రాజ్యసభ ఎన్నికల బరిలోకి అనూహ్యంగా దిగడం వెనుక చంద్రబాబు స్పెషల్ వ్యూహం దాగున్నట్లు తెలుస్తోంది. గెలిచే పరిస్థితి లేకపోయినా బరిలోకి దిగడం వెనుక బాబు వ్యూహం ఇదేనంటూ ఓ థియరీ చర్చల్లోకి వచ్చింది. సంఖ్యాపరంగా చూస్తే నాలుగు రాజ్యసభ సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళతాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ తన అభ్యర్థిని రంగంలోకి దించడం వెనక వ్యూహం ఏమై ఉంటుందనేది ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభపై వైసీపీ కర్చీఫ్‌ వేసింది. తమ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు- మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, అయోధ్య రామిరెడ్డితోపాటు అంబానీ చెప్పిన పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ టికెట్లనున కన్ఫర్మ్‌ చేశారు వైసీపీ బాస్. అంతా సంబరాల్లో మునిగిపోతున్నవేళ, చంద్రబాబు తెరమీదికి వచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ దిగుతోందని, తమ అభ్యర్థిని రంగంలోకి దింపుతామని చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు వ్యూహం ఏంటన్నదానిపై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

గెలిచే అవకాశం ఏ మాత్రం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల బరిలో తమ పార్టీ అభ్యర్థిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యను అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. ఇక్కడే ఎస్సీ అభ్యర్థి విషయంలో టీడీపీ, వైసీపీ పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వైసీపీ.. రాజ్యసభ టికెట్‌ ఎందుకివ్వలేదని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇదే సందర్భంలో వైసీపీ కూడా గత చరిత్రను తిరగదోడుతోంది.

2014లో ఇద్దరు సభ్యులను రాజ్యసభకు పంపే అవకాశం వస్తే చంద్రబాబు ఒకే సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారని వైసీపీ గుర్తుచేస్తోంది. ఆ తర్వాత జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒకే సామాజిక వర్గానికి, తన కోటరీకి టికెట్లు ఇచ్చారన్నది చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న ఎదురుదాడి. గెలిచే అవకాశం ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎస్సీలు ఎందుకు గుర్తుకురాలేదన్నది అధికారపార్టీ వేస్తున్న ప్రశ్న. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వేసిన దళిత కార్డు పరిణామాలు ఎలా ఉంటాయన్నది మరో అంశం. తాము గెలవడానికి పోటీలో దిగడం లేదనీ, వైసీపీ తీరు గురించి ప్రజల్లో చర్చ జరగడానికే పోటీ చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తన సభ్యులకు విప్‌ జారీ చేస్తుంది. ఓటు వేసే సభ్యుడు పార్టీ ఏజెంట్‌కు చూపించి, ఓటువేయాల్సి ఉంటుంది. అలా జరుగుతుందా అన్నది ఆసక్తిగా మారుతుంది. ఎందుకంటే, టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం పసుపు కండువాకు దూరమై, ఫ్యాన్‌ కండువాకు దగ్గరయ్యారు. కానీ అధికారికంగా వైసీపీలో చేరలేదు. ఈ పరిస్థితుల్లో ఈ ముగ్గురు ఏం చేస్తారన్నది అసలుపాయింట్‌. వంశీ, గిరి, బలరాం తమ పార్టీ జారీచేసిన విప్‌కు అనుగుణంగా ఓటు వేస్తారా లేక వైసీపీ డైరెక్షన్‌ను ఫాలో అవుతారా అన్నదిపుడు ప్రశ్న. వీరికి చెక్ పెట్టేందుకే, వీరిని అనర్హులను చేసేందుకే చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపారని భావిస్తున్నారు. పార్టీ విప్‌కు భిన్నంగా వీరు ఓటేస్తే.. వారిని అనర్హులను చేయొచ్చన్నది చంద్రబాబు ప్లాన్ అని అంచనా వేస్తున్నారు.

పార్టీని వీడిని ముగ్గురు ఎమ్మెల్యేలకు బుద్ది చెప్పడంతోపాటు.. ఎస్సీలకు వైసీపీ అవకాశం ఇవ్వలేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు చంద్రబాబు ద్విముఖ వ్యూహం పన్నారని పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. అందుకే గెలిచే ఛాన్స్ ఏ మాత్రం లేకపోయినా.. చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి మొగ్గు చూపారని అంటున్నారు.

Read this: కేంద్రంపై కేసీఆర్ విసుర్లు kcr comments on modi government