కక్షపూరిత రాజకీయాలకు సీఎం జగన్‌ శ్రీకారం: చంద్రబాబు

కక్షపూరిత రాజకీయాలకు సీఎం జగన్‌ తొలిసారి శ్రీకారం చుట్టారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి రాక్షస పాలన ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఫ్యాక్షన్‌ రాజకీయాల జిల్లాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సైతం కడప జిల్లాకే ఫ్యాక్షన్‌ రాజకీయాలను పరిమితం చేసి ఇతర జిల్లాల్లో పెద్దమనిషిగా చెలామణి అయ్యేవారని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన […]

కక్షపూరిత రాజకీయాలకు సీఎం జగన్‌ శ్రీకారం: చంద్రబాబు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 06, 2019 | 6:52 PM

కక్షపూరిత రాజకీయాలకు సీఎం జగన్‌ తొలిసారి శ్రీకారం చుట్టారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి రాక్షస పాలన ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఫ్యాక్షన్‌ రాజకీయాల జిల్లాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సైతం కడప జిల్లాకే ఫ్యాక్షన్‌ రాజకీయాలను పరిమితం చేసి ఇతర జిల్లాల్లో పెద్దమనిషిగా చెలామణి అయ్యేవారని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గతంలో ఎంతో మంది నేతలతో పోరాడామని.. ఇలాంటి విధ్వంసకర రాజకీయాలు ఎప్పుడూ లేవన్నారు.

”ప్రజలు ఓట్లేసి గెలిపించింది ప్రతీకారం తీర్చుకోవడానికా? తమాషాగా ఉందా? నాపై వ్యక్తిగత కక్ష తీర్చుకునే స్థాయికి దిగజారారు. నాకు రక్షణగా పోలీసులను పంపకుండా నీచమైన రాజకీయాలు చేస్తున్నారు” అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ”వైకాపాకు క్యాడర్‌ లేదు. కొన్ని పరిస్థితులు కలిసి రావడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. మాది బలమైన క్యాడర్‌ ఉన్న పార్టీ. దేశంలోనే తొలిసారిగా కార్యకర్తలకు బీమా సౌకర్యం తీసుకొచ్చాం. రాజకీయ కక్షల బాధితుల కోసం పునరావాస నిధి ఏర్పాటు చేశాం. కార్యకర్తల సంక్షేమానికి అన్ని చర్యలూ తీసుకున్నాం” అని చంద్రబాబు వివరించారు.

పోలవరం, అమరావతిపై ఆటలాడుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లను బెదిరించి కాంట్రాక్టులు రద్దుచేసి పంపేస్తారా?, వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికి పెట్టుబడిదారులెవరూ రారన్నారు. బహుశా రాచరికంలోనూ ఇంత మొండితనం ఉండదేమో! అన్నారు. రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే ఇటీవలే ఓ మహిళ దగ్గర 1.5 ఎకరాల పొలం లాక్కున్నారని విమర్శించారు.