వివేకా హత్యపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంపై వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య వెనక చంద్రబాబు, లోకేశ్, ఆదినారాయణ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. వైఎస్ కుటుంబాన్ని అంతం చేయాలనేది టీడీపీ లక్ష్యం అన్నారు విజయసాయిరెడ్డి. 1998లో వైఎస్ రాజారెడ్డి హత్య నుంచి నేటి వివేకానంద రెడ్డి హత్య వరకూ వైఎస్ కుటుంబంపై కుట్ర జరుగుతుందని చెప్పారు. వివేకా హత్య కేసులో ఏపీ […]

కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంపై వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య వెనక చంద్రబాబు, లోకేశ్, ఆదినారాయణ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.
వైఎస్ కుటుంబాన్ని అంతం చేయాలనేది టీడీపీ లక్ష్యం అన్నారు విజయసాయిరెడ్డి. 1998లో వైఎస్ రాజారెడ్డి హత్య నుంచి నేటి వివేకానంద రెడ్డి హత్య వరకూ వైఎస్ కుటుంబంపై కుట్ర జరుగుతుందని చెప్పారు.
వివేకా హత్య కేసులో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం లేదని, సీబీఐ విచారణ జరగాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.



