ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఐదో పుట్టిన రోజు సందర్భంగా గురువారం తెల్లవారుజామున చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి, మనవడు దేవాన్ష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తన నామినేషన్‌ను శుక్రవారం దాఖలు చేయనున్నారు. విదియ తిథితో కూడిన శుక్రవారం నామినేషన్ వేయడానికి సుముహూర్తమని ఆ తేదీని నిర్ణయించారు. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించనున్నారు.