చంద్రబాబు వైజాగ్ టూర్ రద్దు.. ఎందుకంటే?

| Edited By: Srinu

Dec 26, 2019 | 5:39 PM

ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జంకుతున్నారా? షెడ్యూల్డ్ టూర్‌ను సడన్‌గా క్యాన్సిల్ చేసుకున్న చంద్రబాబుపై ఈ తరహా డౌట్లు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ ఏర్పాటు చేయడాన్ని పలువురు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు బహిరంగంగానే సమర్థిస్తున్నారు. చంద్రబాబుతో విభేదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళేందుకు చంద్రబాబు వెనుకంజ వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. జనవరి 2,3 తేదీల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళేందుకు చంద్రబాబు ఇదివరకే షెడ్యూల్ కన్‌ఫర్మ్ చేసుకున్నారు. […]

చంద్రబాబు వైజాగ్ టూర్ రద్దు.. ఎందుకంటే?
Follow us on

ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జంకుతున్నారా? షెడ్యూల్డ్ టూర్‌ను సడన్‌గా క్యాన్సిల్ చేసుకున్న చంద్రబాబుపై ఈ తరహా డౌట్లు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ ఏర్పాటు చేయడాన్ని పలువురు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు బహిరంగంగానే సమర్థిస్తున్నారు. చంద్రబాబుతో విభేదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళేందుకు చంద్రబాబు వెనుకంజ వేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

జనవరి 2,3 తేదీల్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్ళేందుకు చంద్రబాబు ఇదివరకే షెడ్యూల్ కన్‌ఫర్మ్ చేసుకున్నారు. ముందుగా విశాఖకు చేరుకునే చంద్రబాబు సిటీ టీడీపీ నేతలతో భేటీ అవ్వాలని అనుకున్నారు చంద్రబాబు. కానీ.. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేసే ప్రతిపాదనకు చంద్రబాబు వ్యతిరేకమన్న భావన విశాఖ నేతల్లోను, ప్రజల్లోను వ్యాపించింది. టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు రెహమాన్ వంటి వారు పార్టీని వీడారు. మరోవైపు విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు, నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ వంటి వారు రాజధాని విషయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు అభిమతానికి భిన్నంగా విశాఖలో రాజధాని ఏర్పాటు ప్రతిపాదనను వీరంతా స్వాగతించారు.

ఇలాంటి పరిస్థితిలో విశాఖలో ఎదైనా చేదు అనుభవం ఎదురవుతుందేమో అన్న అనుమానంతో చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంత పర్యటనను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రు మురళీ లాంటి వారు కూడా రాజధాని విషయంలో చంద్రబాబు స్టాండ్‌ని వ్యతిరేకిస్తున్నారు. ఈ అన్ని అంశాలను దృష్టిలో వుంచుకుని ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనను చంద్రబాబు రద్దు చేసుకున్నారని తెలుగుదేశం పార్టీలో బలమైన టాక్ వినిపిస్తోంది.