వాళ్లు నూరేళ్ల కుర్రాళ్లు.. అందుకే అంత స్పీడుగా వచ్చారు

| Edited By:

Oct 21, 2019 | 6:58 PM

సోమవారం జరిగిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. ఆయా రాష్ట్రాల్లో శతాధిక వృద్ధులు సైతం ఓటు హక్కు వినియోగించుకోడానికి కష్టమైనా సరే ఉత్సాహంగా ముందుకు వచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పూణెలోని లోహెగావ్ ప్రాంతానికి చెందిన హాజీ ఇబ్రహీం అలీమ్ జోద్ అనే 102 సంవత్సరాల వయసున్న వృద్ధుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈయన గత నాలుగు రోజులనుంచి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ […]

వాళ్లు నూరేళ్ల కుర్రాళ్లు..  అందుకే అంత స్పీడుగా వచ్చారు
Follow us on

సోమవారం జరిగిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. ఆయా రాష్ట్రాల్లో శతాధిక వృద్ధులు సైతం ఓటు హక్కు వినియోగించుకోడానికి కష్టమైనా సరే ఉత్సాహంగా ముందుకు వచ్చారు.

మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పూణెలోని లోహెగావ్ ప్రాంతానికి చెందిన హాజీ ఇబ్రహీం అలీమ్ జోద్ అనే 102 సంవత్సరాల వయసున్న వృద్ధుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈయన గత నాలుగు రోజులనుంచి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు.

అదే విధంగా యూపీలో జరుగుతున్న ఉపఎన్నికలో హర్ష్‌సింగ్ అనే నూటఆరేళ్ల వృద్ధుడు బహ్రైన్ జిల్లాలోని బల్హాలో వేటు వేసి.. తన కర్తవ్యాన్ని నిరూపించుకున్నారు. అలాగే లోచన్ ‌నాయక్ అనే శతాధిక వృద్ధురాలు తాను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ బర్ఫాలిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మహారాష్ర్టలో ఓటు హక్కు వినియోగించుకోడానికి వచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లైన్‌లో నిలుచున్న సమయంలో ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధుణ్ని చూశారు. దీంతో వెంటనే ఆమె ఆయన వద్దకు వెళ్లి అభినందించారు. ఓటువేయడానికి ఆలోచించేవారు…ఈయనను చూసి నేర్చుకోవాలని, ఓటు హక్కు తప్పకుండా వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు.