AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘తాండవ్’ వివాదం, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీల రెగ్యులేషన్ కోసం సెన్సార్ బోర్డు అవసరం, బీజేపీ నేతలు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ వెబ్ సిరీస్ 'తాండవ్' వివాదం వేడెక్కుతోంది. దీన్ని ప్రసారం చేస్తున్న అమెజాన్ ప్రైమ్ నుంచి సంజాయిషీ కావాలని కేంద్ర సమాచార..

'తాండవ్' వివాదం, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీల రెగ్యులేషన్ కోసం సెన్సార్ బోర్డు అవసరం, బీజేపీ నేతలు
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jan 18, 2021 | 9:25 AM

Share

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ వెబ్ సిరీస్ ‘తాండవ్’ వివాదం వేడెక్కుతోంది. దీన్ని ప్రసారం చేస్తున్న అమెజాన్ ప్రైమ్ నుంచి సంజాయిషీ కావాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సమన్లు జారీ చేసింది. కాగా- ఈ సిరీస్ లోని నటులు, దర్శకునిపై బీజేపీ నేత రామ్ కదమ్ నేరుగా సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కి లేఖ రాస్తూ.., హిందూ దేవుళ్లను, దేవతలను కించపరిచేలా ఉన్న సిరీస్ లను ప్రసారం చేయకుండా చూసేందుకు, కంటెంట్ ను సమీక్షించేందుకు సెన్సార్ బోర్డును ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. తాండవ్ మేకర్స్ కావాలనే హిందూ దేవుళ్లను, దేవతలను హేళన చేసేలా ఈ సిరీస్ తీశారన్నారు.   తాండవ్ సిరీస్ లో నటించిన సైఫ్ అలీఖాన్, డింపుల్ కపాడియా, జేషన్ అయూబ్ లతో బాటు డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్ కూడా అపాలజీ చెప్పాలని ఆయన ఇదివరకే డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. లోగడ కూడా ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి రావణునిపై చేసిన ఓ వ్యాఖ్యకు సైఫ్ అలీఖాన్ ఆ తరువాత క్షమాపణ చెప్పాడు.

Also Read:

Father And Son Die: ప్రాణాలు తీసిన కోడికూర వంట.. విద్యుదాఘాతంతో తండ్రీకొడుకుల మృతి..

రైతుల నిరసనలు, నేడు సుప్రీంకోర్టు విచారణ, 2024 వరకు ఆందోళనకు సిధ్దమంటున్న అన్నదాతలు, రేపు మళ్ళీ చర్చలు

Covid Vaccination: తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ కీలక నిర్ణయం.. వ్యాక్సినేషన్ కేంద్రాల సంఖ్య భారీగా పెంపు..