వైఎస్ వివేకా హత్యకేసులో లేటెస్ట్ అప్డేట్

|

Sep 18, 2020 | 1:28 PM

మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు తమకు ఇవ్వాలని కోరుతూ పులివెందుల‌ కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్‌ వేశారు.

వైఎస్ వివేకా హత్యకేసులో లేటెస్ట్ అప్డేట్
Follow us on

మాజీ మంత్రి, సీఎం జగన్ చిన్నాన్న వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు తమకు ఇవ్వాలని కోరుతూ పులివెందుల‌ కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్‌ వేశారు. గురువారం ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి, దానిని నేర విభాగానికి పంపించారు.  దీనిపై శుక్రవారం విచారణ జరపనున్నట్లు కోర్టు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయంపై వివరాలు తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీకాంత్ తో అరగంటపాటు చర్చించారు. అనంతరం  పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో కలిసి సీబీఐ అధికారులు ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లారు. ఈ నెల 13న ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందులకు రాగా.. ప్రస్తుతం మరో ఇద్దరు వచ్చారు.

వివేకా కుమార్తె హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం 15 మంది అనుమానితులు ఉన్నారు. వారిలో ఐదుగురుని మాత్రమే సీబీఐ అధికారులు విచారించారు. తాజాగా మిగిలిన వారందర్నీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read :

ఫారెన్ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ వచ్చిందంటూ మహిళకు టోకరా

విషాదం, నేరెడిమేట్‌లో మిస్సైన బాలిక మృతదేహం లభ్యం