ఫారెన్ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ వచ్చిందంటూ మహిళకు టోకరా

ఫ్రీ గిప్ట్ అంటే చాలు..ఓ ఎగబడి వెళ్లిపొతాం. 10 వేల పెట్టి కొంటే గిఫ్ట్ అంటారు. తీరా 100 విలువ చేసే జగ్గో, మగ్గో చేతిలో పెడతారు.

ఫారెన్ నుంచి కాస్ట్లీ గిఫ్ట్ వచ్చిందంటూ మహిళకు టోకరా
Follow us

|

Updated on: Sep 18, 2020 | 5:44 PM

ఫ్రీ గిప్ట్ అంటే చాలు..ఓ ఎగబడి వెళ్లిపొతాం. 10 వేల పెట్టి కొంటే గిఫ్ట్ అంటారు. తీరా 100 విలువ చేసే జగ్గో, మగ్గో చేతిలో పెడతారు. ఊరు, పేరు తెలియని వారు ఫోన్ చేసి మీకు విలువైన గిఫ్ట్ వచ్చిందన్నా చాలు..వారు ఎగిరి గంతేస్తారు కొందరు. మన పిచ్చి కాకపోతే, ఈ రోజుల్లో ఎవరైనా ఫ్రీగా మనకు ఎందుకు ఇస్తారు. దాని వెనుక స్కెచ్, స్కామ్ ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అలాంటి ఫోన్ కాల్స్ ను గుడ్డిగా నమ్మితే బుక్కవ్వక తప్పదు. తాజాగా ఓ మహిళను కేటుగాళ్లు ఇలానే బురిడీ కొట్టించారు. ఫ్రీ గిఫ్ట్ పేరుతో హైదరాబాద్‌లోని సైదాబాద్‌ ఏరియాకు చెందిన మహిళ నుంచి రూ.6.30లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఆమెకు ఫారెన్ నుంచి విలువైన డైమెండ్ నక్లెస్ బహుమతిగా వచ్చాయని నమ్మించారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ విభాగం నుంచి కాల్‌ చేస్తున్నామని ఆ బహుమతి అందుకోవాలని మాయమాటలు చెప్పారు. అయితే జీఎస్‌టీ, కస్టమ్‌ వంటి ఫీజుల పేరు చెప్పి పలు దఫాలుగా ఆమె వద్ద నుంచి రూ.6.30లక్షలు వివిధ ఖాతాల్లో జమ చేయించుకున్నారు.

అయితే వారు చెప్పినంత డబ్బులు వేసినా బహుమతి మాత్రం ఇంటికి రావడం లేదు. మళ్లీ మళ్లీ ఇంకా డబ్బు కావాలని అడుగుతున్నారు. ఇక్కడే సదరు మహిళకు సీన్ అర్థమైంది. మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read :

ప్రముఖ డిజైనర్​ అనుమానాస్పద రీతిలో మృతి

సుశాంత్ కేసు పక్కదోవ పట్టించేందుకే డ్రగ్స్ తెరపైకి : నగ్మ

మీరు ధరించే దుస్తులు కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయని తెలుసా?
మీరు ధరించే దుస్తులు కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయని తెలుసా?
నా కల నెరవేరింది.. నటి సోనాక్షి సిన్హా.| శ్రుతి హాసన్‌ బ్రేకప్.?
నా కల నెరవేరింది.. నటి సోనాక్షి సిన్హా.| శ్రుతి హాసన్‌ బ్రేకప్.?
సీతారాములుగా ఆ ఇద్దరూ ఎంత అందంగా ఉన్నారో..
సీతారాములుగా ఆ ఇద్దరూ ఎంత అందంగా ఉన్నారో..
విరాళాలు సేకరించి కిట్‌లు కొనుగోలు.. తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం..
విరాళాలు సేకరించి కిట్‌లు కొనుగోలు.. తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం..
ఈ చిన్న అమ్మాయ్.. ఇప్పుడు పెద్ద హీరోయిన్ గుర్తుపట్టారా..?
ఈ చిన్న అమ్మాయ్.. ఇప్పుడు పెద్ద హీరోయిన్ గుర్తుపట్టారా..?
ఒక్కసారి ఛార్జింగ్‌తో 323 కిలోమీటర్లు.. వేగవంతమైన ఎలక్ట్రిక్‌ బైక
ఒక్కసారి ఛార్జింగ్‌తో 323 కిలోమీటర్లు.. వేగవంతమైన ఎలక్ట్రిక్‌ బైక
పవర్‌స్టార్‌ టు కింగ్‌.. ఖాకీలో కనిపించబోయేది ఎవరు.?
పవర్‌స్టార్‌ టు కింగ్‌.. ఖాకీలో కనిపించబోయేది ఎవరు.?
చిన్న పొరపాటుతో రూ. 20లక్షలకు కొన్నారు.. కట్‌చేస్తే..
చిన్న పొరపాటుతో రూ. 20లక్షలకు కొన్నారు.. కట్‌చేస్తే..
అలెగ్జాండర్ కూల్చిన కాశ్మీర్‌లోని ఆలయం.. 524 ఏళ్లకు పునర్నిర్మాణం
అలెగ్జాండర్ కూల్చిన కాశ్మీర్‌లోని ఆలయం.. 524 ఏళ్లకు పునర్నిర్మాణం
ఆ నియోజకవర్గం మినహా 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు!
ఆ నియోజకవర్గం మినహా 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు!