రక్త హీనత తగ్గాలంటే పాలకూరను తీసుకోవాలని నిపుణులు చెబతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే ఐరన్ రక్త హీనతకు చెక్ పెడుతుంది.
సిట్రస్ జాతి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా రక్త హీనత సమస్య దరిచేరదు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ సి మేలు చేస్తుంది.
రక్త హీనత సమస్యతో బాధపడే వారు టమాటాలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఐరన్ అందించడంలో ఉపయోగపడతాయి.
గుమ్మడి గింజలల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని గుణాలు ఐరన్ సమస్యకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది.
రక్త హీనత సమస్యకు చెక్ పెట్టడంలో డార్క్ చాక్లెట్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
యాపిల్ తింటే వ్యాధులకు చెక్ పెట్టొచ్చని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే రోజుకో యాపిల్ తినడం వల్ల రక్త హీనత సమస్య కూడా దరిచేరదని నిపుణులు చెబుతున్నారు.
రోజూ అరటి పండు తినడం వల్ల రక్త హీనత సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐరన్ పెరగడంలో అరటి పండు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.