స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.1800 కోట్ల కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఢిల్లీలోని మూడు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు చేశారు. రూ.1800 కోట్ల ఎస్బీఐ కుంభకోణం కేసు నమోదు చేసిన సీబీఐ ఢిల్లీలోని లజపతినగర్ లోని ఓ ప్రైవేటు కంపెనీపై దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ స్కాంకు సంబంధించి లజపతినగర్ లోని ఓ కంపెనీ డైరెక్టర్, గ్యారంటీర్ , మరికొందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎస్‌బీఐను రూ.1,800 కోట్ల మేర రుణాలు తీసుకొని వాటిని దారి మళ్లించారని సీబీఐ దర్యాప్తులో తేలింది. ఢిల్లీలో మోసగించిన కంపెనీతోపాటు డైరెక్టర్ల ఇళ్లపై సీబీఐ దాడులు జరిపింది. వీరిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసు సంబంధించి మరిన్ని ఆధారాలను రాబడుతున్నట్లు సమాచారం.