బ్రేకింగ్ : సీఐడీ డీఐజీ త్రివిక్రమ్ వర్మపై బదిలీ వేటు

|

Aug 02, 2020 | 10:20 PM

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐపీఎస్ అధికారి బదిలీ అయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ డీఐజీ తివిక్రమ్ వర్మపై బదిలీ వేటు పడింది. సీఐడీ నుంచి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బ్రేకింగ్ : సీఐడీ డీఐజీ త్రివిక్రమ్ వర్మపై బదిలీ వేటు
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐపీఎస్ అధికారి బదిలీ అయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి, సీఐడీ డీఐజీ తివిక్రమ్ వర్మపై బదిలీ వేటు పడింది. సీఐడీ నుంచి సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత జూన్ నెలలోనే భారీగా ఐపీఎస్‌ అధికారులకు ఏపీ ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. మొత్తం 23 మంది ఐపీఎస్‌ అధికారులను ఈ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా త్రివిక్రమ్ వర్మకు సీఐడీ డీఐజీగా ప్రమోషన్ లభించింది. బాధ్యతలు స్వీకరించి నెల రోజులు పూర్తయ్యే సరికి మరోసారి ఆయన్ను మారుస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.