వివాదంలో చిక్కుకున్న సూపర్ స్టార్!

|

Jan 18, 2020 | 9:27 AM

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చిక్కుల్లో పడ్డారు. ఈ నెల 14న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ‘తుగ్లక్’ పత్రికా సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఆయన ద్రావిడ ఇయక్కం నాస్తికుడు తంతై పెరియార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ద్రావిడ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రజినీకాంత్‌పై ఐపీసీ 153 సెక్షన్ ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోయంబత్తూరుకు చెందిన ద్రవిడార్ సభ్యులు డిమాండ్ చేశారు. 1971లో పెరియార్ నిర్వహించిన మహానాడులో శ్రీరాముడి చిత్రపటానికి అవమానం […]

వివాదంలో చిక్కుకున్న సూపర్ స్టార్!
Follow us on

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చిక్కుల్లో పడ్డారు. ఈ నెల 14న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ‘తుగ్లక్’ పత్రికా సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఆయన ద్రావిడ ఇయక్కం నాస్తికుడు తంతై పెరియార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ద్రావిడ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రజినీకాంత్‌పై ఐపీసీ 153 సెక్షన్ ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోయంబత్తూరుకు చెందిన ద్రవిడార్ సభ్యులు డిమాండ్ చేశారు.

1971లో పెరియార్ నిర్వహించిన మహానాడులో శ్రీరాముడి చిత్రపటానికి అవమానం జరిగిందని.. ఇందువల్లే పెరియార్‌ సిద్ధాంతాలను అనుసరించే డీఎంకే పార్టీ రాజకీయంగా దెబ్బతిందని రజినీకాంత్ వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలను డీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. ఇక ‘తుగ్లక్’ సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకల్లో రజనీకాంత్ మాట్లాడుతూ ‘ మురసోలి పత్రిక చేతిలో ఉంటే డీఎంకే పార్టీ కార్యకర్తగా పరిగణిస్తారని.. అదే తుగ్లక్ పత్రిక ఉంటే మేధావి అంటారని చెప్పుకొచ్చారు. కాగా, ఈ వ్యాఖ్యల పట్ల ద్రావిడ సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి.