రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ ఢీకొన్న కారు.. ఔదార్యం చాటిన మంత్రి సబితా

|

Dec 20, 2020 | 5:05 PM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర  ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం అంతారం స్టేజ్‌ వద్ద దివిచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది.

రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ ఢీకొన్న కారు.. ఔదార్యం చాటిన మంత్రి సబితా
Road Accident
Follow us on

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర  ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం అంతారం స్టేజ్‌ వద్ద దివిచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది. వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో బైక్ లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఔదార్యాన్ని చాటుకున్నారు. ప్రమాదాన్ని చూసిన ఆమె అక్కడ ఆగారు. వెంటనే అంబులెన్స్ ను రప్పించి మృతదేహాన్ని ఆసుపత్రి తరలించారు.