కరోనా వేళ సెక్స్.. ముద్దు వద్దు

|

Sep 03, 2020 | 9:21 PM

కరోనా వేళ సెక్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కెనడా వైద్యులు సూచిస్తున్నారు. ముద్దులు వద్దని, సెక్స్ చేసేటప్పుడు మాస్క్ ధరించాలని అంటున్నారు. వీర్యం, వెజినా ద్రవాల ద్వారా కరోనా వచ్చే ముప్పు తక్కువేనని..

కరోనా వేళ సెక్స్.. ముద్దు వద్దు
Follow us on

కరోనా వేళ సెక్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని కెనడా వైద్యులు సూచిస్తున్నారు. ముద్దులు వద్దని, సెక్స్ చేసేటప్పుడు మాస్క్ ధరించాలని అంటున్నారు. వీర్యం, వెజినా ద్రవాల ద్వారా కరోనా వచ్చే ముప్పు తక్కువేనని డాక్టర్ థెరెసా టామ్ తెలిపారు. కానీ కొత్త భాగస్వాములతో శృంగారంలో పాల్గొనడం వల్ల వైరస్ సోకే ముప్పు ఎక్కువవుతుందన్నారు. ముఖ్యంగా మౌత్ కిస్ లకు దూరంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. భాగస్వాముల ముఖానికి ముఖం దగ్గరగా రానీయొద్దని..లైంగిక చర్యకు ముందు.. మీకు, మీ భాగస్వామికి కరోనా లక్షణాలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లైంగిక క్రియలో రిస్క్‌ను తగ్గించుకోవచ్చని టామ్ తెలిపారు. ఇలాఉంటే, అరక్షిత లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల హెచ్ఐవీ, గనేరియా లాంటి సుఖ రోగాలు వస్తాయని.. అందుకు రక్షణగా కండోమ్ వాడాలని ప్రభుత్వాలు ప్రచారం చేశాయి. అయితే, ఇప్పుడు కండోమ్ తో పాటు మాస్క్ కూడా కంపల్సరీ అయింది.