శ్రీశైల శిఖర దర్శనం కోసం వాచ్ టవర్…

|

Aug 27, 2020 | 10:17 PM

శ్రీశైల కొండల్లో మరో అద్బుత కట్టడం నిర్మించారు. శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం శ్రీశైల శిఖరం వద్ద వాచ్ టవర్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆరు అంతస్తులతో వాచ్ టవర్ నిర్మించారు. దీని పైనుంచి శ్రీశైల క్షేత్ర పరిసరాలతోపాటు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. వాచ్ టవర్ తోపాటు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణతో కనిపించేలా పురాతన శివలింగాకారానికి అధునాతన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తున్నట్లు ఆలయ ఈవో కేఎస్ […]

శ్రీశైల శిఖర దర్శనం కోసం వాచ్ టవర్...
Follow us on

శ్రీశైల కొండల్లో మరో అద్బుత కట్టడం నిర్మించారు. శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం శ్రీశైల శిఖరం వద్ద వాచ్ టవర్ ఏర్పాటు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆరు అంతస్తులతో వాచ్ టవర్ నిర్మించారు. దీని పైనుంచి శ్రీశైల క్షేత్ర పరిసరాలతోపాటు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.

వాచ్ టవర్ తోపాటు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణతో కనిపించేలా పురాతన శివలింగాకారానికి అధునాతన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రసాదం పథకం నిధులతో పుష్కరణి జీర్ణోద్ధారణ, పార్కింగ్ సౌకర్యం, ఆలయంలో రాతి బండలు పరచడంతో పాటు ఔషధ మొక్కలతో ఉద్యానవనాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

క్షేత్ర దర్శనానంతరం ప్రతి భక్తుడు శిఖర దర్శనం చేసుకునేలా పంచముఖ ద్వారమైన శ్రీశైల శిఖరేశ్వర ఆలయ విశిష్టతను తెలిపేలా సైన్ బోర్డులను తక్షణమే ఏర్పాటు చేయాలని శ్రీశైల ప్రభ సంపాదకుడు అనిల్ కుమార్ కు సూచించారు. సమావేశంలో ఈఈ మురళి, డీఈలు నర్సింహరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సీసీ జగదీశ్ ఉన్నారు.