రామజన్మభూమిలో కొత్త వివాదం.. అయోధ్యలో బౌద్ధ సన్యాసుల నిరసన..!

యూపీలోని అయోధ్యలో బౌద్ధ సన్యాసులు ఆందోళనలను చేపట్టారు. ఆజాద్ బౌద్ధ ధర్మసేన ఈ ఆందోళనకు నాయకత్వాన్ని వహించింది. రామ జన్మభూమిలో యునెస్కో ద్వారా తవ్వకాలను చేపట్టాలంటూ నిరసన ప్రదర్శనలను చేపట్టారు.

రామజన్మభూమిలో కొత్త వివాదం.. అయోధ్యలో బౌద్ధ సన్యాసుల నిరసన..!

Edited By:

Updated on: Jul 15, 2020 | 3:59 PM

Buddhist Monks Protest Over Ayodhya: యూపీలోని అయోధ్యలో బౌద్ధ సన్యాసులు ఆందోళనలను చేపట్టారు. ఆజాద్ బౌద్ధ ధర్మసేన ఈ ఆందోళనకు నాయకత్వాన్ని వహించింది. రామ జన్మభూమిలో యునెస్కో ద్వారా తవ్వకాలను చేపట్టాలంటూ నిరసన ప్రదర్శనలను చేపట్టారు. అయోధ్య మెజిస్ట్రేట్ కార్యాలయం ముందు బైఠాయించారు. రామజన్మభూమి స్థలంలో ఇదివరకు నిర్వహించిన తవ్వకాల సందర్భంగా గౌతమ బుద్ధుడు, బౌద్ధిజానికి సంబంధించిన వస్తువులు వెలుగులోకి వచ్చాయని అన్నారు. తవ్వకాల సమయంలో రామజన్మభూమి స్థలంలో దొరికిన అన్ని రకాల వస్తువులను బహిర్గతం చేయాలని, వాటిని ప్రజలకు ప్రదర్శించాలని డిమాండ్ చేశారు.

Also Read: విట్,  ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల బీటెక్‌ ప్రవేశపరీక్షలు రద్దు..!