అనంతపురం: పబ్జీ‌ గేమ్ మరో టీనేజర్ ప్రాణం తీసింది

|

Sep 12, 2020 | 2:37 PM

బ్యాన్ చేసినా కూడా  పబ్జి గేమ్​ టీనేజర్ల ప్రాణాలు తీస్తూనే ఉంది. ఈ ఆటకు బానిసై బీటెక్ విద్యార్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనంతపురం:  పబ్జీ‌ గేమ్ మరో టీనేజర్ ప్రాణం తీసింది
Follow us on

బ్యాన్ చేసినా కూడా  పబ్జి గేమ్​ టీనేజర్ల ప్రాణాలు తీస్తూనే ఉంది. ఈ ఆటకు బానిసై బీటెక్ విద్యార్థి కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరంలో రెవెన్యూ కాలనీలో ఉన్న నరసింహారెడ్డి, హిమజా రాణి కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి. చెన్నైలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండగా, కాలేజీలో పబ్జీ గేమ్ కు అలవాటుపడ్డాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్జీ గేమ్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మనస్థాపానికి లోనైన కిరణ్… ఐదో తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుమారుడు కనిపించకపొయ్యేసరికి పేరెంట్స్ కంగారు పడి పోలీసులకు ఫిర్యాాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇంటి పైన నిర్మాణంలో ఉన్న ఓ గది నుంచి దుర్వాసన రావడంతో కూలీలు తలుపులు పగలగొట్టి చూడగా, కిరణ్ లోపల ఉరికి వేలాడుతూ కనిపించాడు. పబ్జీ బ్యాన్ చేశారన్న ఆవేదనతో ఉన్న కిరణ్… సూసైడ్ చేసుకున్నాడని గుర్తించారు తల్లిదండ్రులు. కుళ్లిన శవాన్ని చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు… సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

Also Read : “పుస్తెల తాడు తాకట్టు పెట్టైనా”, పులస కొనేస్తున్నారు !