పంటనీటికోసం కత్తులతో దాడి చేసుకున్న అన్నదమ్ములు
చిత్తూరుజిల్లా మదనపల్లి మండలంలో రక్తసంబంధాలు సమాధి అయ్యాయి. అబ్బగొందినాయునివారి పల్లిలో పొలం దగ్గర అన్నదమ్ములు తగాదా పడ్డారు. పంటపొలానికి నీటి వాటా విషయంలో కత్తులతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు వేట కొడవళ్లతో దాడి చేసుకోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాడిలో గాయపడ్డ చిన్నబ్బ, అమర్నాధ్ లను ఆసుపత్రికి తరలించారు. వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డ రమణ, శ్రీనివాసులను పోలీసులు అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి […]

చిత్తూరుజిల్లా మదనపల్లి మండలంలో రక్తసంబంధాలు సమాధి అయ్యాయి. అబ్బగొందినాయునివారి పల్లిలో పొలం దగ్గర అన్నదమ్ములు తగాదా పడ్డారు. పంటపొలానికి నీటి వాటా విషయంలో కత్తులతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారు. ఒకరిపై ఒకరు వేట కొడవళ్లతో దాడి చేసుకోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనపై మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాడిలో గాయపడ్డ చిన్నబ్బ, అమర్నాధ్ లను ఆసుపత్రికి తరలించారు. వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డ రమణ, శ్రీనివాసులను పోలీసులు అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.