Bailey Bridge in Kashmir:దేశ రక్షణ కోసమే కాదు.. ప్రజలకు ఎక్కడ ఎలాంటి అవసరం వచ్చినా.. ప్రకృతి విపత్తులు తలెత్తినా తమ విశేషమైన సేవలను అందించే వ్యక్తులు సైనికులు. తమ ప్రాణాలను , కుటుంబాలను లెక్కచేయకుండా పనిచేస్తారు. తుపాకులు గర్జిస్తున్నా, వరదలు పోటెత్తుతున్న, కొండచరియలు విరిగిపడుతున్నా, దేశంలో ఎవరికీ ఆపద ఎదురైనా వెంటనే నేనున్నాను అంటూ ముందుకొస్తుంది ఆర్మీ. ఒక్క మన దేశంలోనే కాదు.. విదేశాల్లో విపత్కర పరిస్థితులు ఏర్పడినా అక్కడకు భారత దేశం తరపున వెళ్లి విశేష సేవలను అందిస్తారు.దేశ ప్రతిష్టను మరింత ఇడి మూడింపజేస్తారు. ఎండ, వాన, చలి వీటిని లెక్కచేయకుండా అన్నింటికీ తెగించి సైన్యంలో చేరుతారు కనుక దేశం కోసం నిలబడి సేవ చేస్తుంటారు.
జమ్మూ కాశ్మీర్ వంటి పర్వత ప్రాంతాల్లో పనిచేయడం అంటే కత్తితో సాము లాంటిదే. కొండచరియలు విరిగిపడుతుంటాయి. బ్రిడ్జీలు కూలిపోతుంటాయి. అలాంటి సమయంలో అత్యవసరంగా స్పందించి గంటల వ్యవధిలోనే బ్రిడ్జీలను నిర్మించాల్సి ఉంటుంది. ఇలానే జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ లోని కేలా మోర్ వద్ద వంతెన కూలిపోయింది. కూలిన వంతెనను తిరిగి నిర్మించేందుకు జవాన్లు రంగంలోకి దిగారు. కేవలం 60 గంటల సమయంలోనే 120 అడుగుల పొడవైన బెయిలీ వంతెనను నిర్మించారు. శనివారం సాయంత్రం ట్రయల్ రన్ నిర్వహించిన సైనికులు .. అనంతరం ప్రజల రాకపోకలకు అనుమతినిచ్చారు.
Also Read: మహారాష్ట్రలో రోజు రోజుకీ వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ.. తాజగా 983 పక్షులు మృతి..