ఫేమస్ ‘గూఢచారి 007 జేమ్స్ బాండ్’ ఇక లేరు

| Edited By: Ravi Kiran

Oct 31, 2020 | 8:49 PM

ప్రముఖ బ్రిటిష్ నటుడు షాన్ కానరీ కన్ను మూశారు. ప్రస్తుతం బహమాస్ లో ఉన్న ఈయన తన 90 ఏళ్ళ వయస్సులో నిద్రలోనే మరణించారు. గూఢచారి జేమ్స్ బాండ్ గా ఏడు చిత్రాల్లో నటించిన షాన్ కానరీ తన సుమారు రెండు దశాబ్దాల కాలంలో ఆస్కార్ అవార్డుతో సహా మూడు గోల్డెన్ గ్లోబ్స్, రెండు బాఫ్తా అవార్డులు కూడా సాధించారు. ఈ స్కాటిష్ నటుడు 1962 లో మొదటిసారి ‘డాక్టర్ నో’ సినిమాలో నటించారు. అక్కడితో మొదలైన […]

ఫేమస్ గూఢచారి 007 జేమ్స్ బాండ్ ఇక లేరు
Follow us on

ప్రముఖ బ్రిటిష్ నటుడు షాన్ కానరీ కన్ను మూశారు. ప్రస్తుతం బహమాస్ లో ఉన్న ఈయన తన 90 ఏళ్ళ వయస్సులో నిద్రలోనే మరణించారు. గూఢచారి జేమ్స్ బాండ్ గా ఏడు చిత్రాల్లో నటించిన షాన్ కానరీ తన సుమారు రెండు దశాబ్దాల కాలంలో ఆస్కార్ అవార్డుతో సహా మూడు గోల్డెన్ గ్లోబ్స్, రెండు బాఫ్తా అవార్డులు కూడా సాధించారు. ఈ స్కాటిష్ నటుడు 1962 లో మొదటిసారి ‘డాక్టర్ నో’ సినిమాలో నటించారు. అక్కడితో మొదలైన ఆయన సినీ ప్రస్థానం 1983 లో ‘నెవర్ సే నెవర్ ఎగైన్ ‘ చిత్రం వరకు సాగింది. ‘ది అన్ టచబుల్స్ ‘ మూవీలో ఐరిష్ పోలీసు అధికారిగా నటించి ఉత్తమ సహాయ నటుడి అవార్డు పొందారు.

ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్, ఇండియానా జోన్స్, ది లాస్ట్ క్రూసేడ్, ది రాక్-2 వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ ఈ స్కాటిష్ యాక్టర్ కి 007 జేమ్స్ బాండ్ చిత్రమే వరల్డ్ వైడ్ గా పాపులారిటీ తెచ్సి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది  షాన్ కానరీ అభిమానులయ్యారు.