చంద్రబాబుపై బోయపాటి అద్భుతమైన సాంగ్

|

Mar 30, 2019 | 9:03 PM

విజయవాడ: ఎన్నికల సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబుపై ఒక అద్భుతమైన సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను సిద్ధం చేశారు. ఆ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. “శిల మోసే గాయాలే కావా శిల్పాలు.. నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్లు..” అంటూ పాట భావోద్వేగంగా సాగింది. శిధిలాలే సదనాలై సాగిన దారుల్లో.. నిలువెల్లా బలిచేసే కుట్రల కేంద్రాలు.. నిన్ను చీల్చినా నీ వెన్ను వణకదు.. నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు.. నువ్వు చమ్మగిల్లనీయవు ఏ కళ్లైనా.. […]

చంద్రబాబుపై బోయపాటి అద్భుతమైన సాంగ్
Follow us on

విజయవాడ: ఎన్నికల సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబుపై ఒక అద్భుతమైన సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను సిద్ధం చేశారు. ఆ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. “శిల మోసే గాయాలే కావా శిల్పాలు.. నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్లు..” అంటూ పాట భావోద్వేగంగా సాగింది.

శిధిలాలే సదనాలై సాగిన దారుల్లో.. నిలువెల్లా బలిచేసే కుట్రల కేంద్రాలు.. నిన్ను చీల్చినా నీ వెన్ను వణకదు.. నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు.. నువ్వు చమ్మగిల్లనీయవు ఏ కళ్లైనా.. అంటూ కొనసాగింది పాట.

పాటకు తగిన విధంగా ఫోటోలను ప్రదర్శించడం జరిగింది. ఇందులో చంద్రబాబు కష్టాన్ని వివరిస్తూ, ఆయనకు వ్యతిరేకంగా జగన్, కేసీఆర్, మోడీ ఏకమై ముప్పేట దాడి చేస్తున్నా.. ఐదు కోట్ల జన రక్షణ చంద్రబాబుకు ప్రాణాలు అంటూ వివరించడం జరిగింది.

చంద్రబాబు కోసం బోయపాటి పలు యాడ్‌లు కూడా చిత్రిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన పలు పనులపై వస్తున్న లఘు చిత్రాలు బోయపాటి చేసినవే.