నేడు గోల్కొండకు తొలి బోనం..

| Edited By:

Jul 04, 2019 | 8:06 AM

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే పండుగ బోనాలు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలు జంట నగరాల్లో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ముందుగా గురువారం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికితొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభించి, చివరికి గోల్కొండలోనే అంకురార్పణ జరగనుంది. డప్పు చప్పుళ్లు.. పోతురాజుల విన్యాసాలు.. కళాకారుల ఆటపాటలు.. భక్తుల కోలాహాల మధ్య ఈ పండుగను నెలరోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. ఆషాడ మాసంలో అంగరంగ వైభవంగా జరిగే బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర […]

నేడు గోల్కొండకు తొలి బోనం..
Follow us on

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే పండుగ బోనాలు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలు జంట నగరాల్లో ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ముందుగా గురువారం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికితొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభించి, చివరికి గోల్కొండలోనే అంకురార్పణ జరగనుంది. డప్పు చప్పుళ్లు.. పోతురాజుల విన్యాసాలు.. కళాకారుల ఆటపాటలు.. భక్తుల కోలాహాల మధ్య ఈ పండుగను నెలరోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.

ఆషాడ మాసంలో అంగరంగ వైభవంగా జరిగే బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ సీఎం పద్మారావు లంగర్‌ హౌస్‌లో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సౌకర్యాలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ఆలయాల్లో ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది.