ముంబై నగరంలో కొవిడియట్స్‌ ఎక్కువేనట..!

|

Sep 21, 2020 | 5:20 PM

దేశంలో కరోనా ఒకవైపు వికృతరూపం ప్రదర్శిస్తే.. మరోవైపు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు మరికొందరు. కొవిడ్ నిబంధనలుకు గాలికి వదిలేసి దర్జా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి కేసులు అధికంగా ఉన్న ముంబై నగరంలో జనం ఏం పట్టనట్లు ఉంటున్నారు.

ముంబై నగరంలో కొవిడియట్స్‌ ఎక్కువేనట..!
Follow us on

దేశంలో కరోనా ఒకవైపు వికృతరూపం ప్రదర్శిస్తే.. మరోవైపు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు మరికొందరు. కొవిడ్ నిబంధనలుకు గాలికి వదిలేసి దర్జా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి కేసులు అధికంగా ఉన్న ముంబై నగరంలో జనం ఏం పట్టనట్లు ఉంటున్నారు. కనీసం మూతికి మాస్క్ కూడా ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది.

కొవిడ్‌ నిబంధనలు పాటించనివారిని కొవిడియట్స్‌గా పిలుస్తున్నారు. అయితే, ముంబైలో చాలామంది ఇలాంటివారేనని బీఎంసీ వెల్లడించింది. మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న తరుణంలోనూ చాలామంది పనిలేకున్నా రోడ్లపై తిరుగుతున్నారని, కొవిడ్‌ నిబంధనలు అసలు పాటించడం లేదని తెలిపింది. మెరైన్‌ డ్రైవ్‌తోపాటు ఇతరచోట్ల మాస్కులు ధరించకుండానే వాకింగ్‌ కూడా చేస్తున్నారని పేర్కొంది. ఇలా నిబంధనలు ఉల్లఘించిన వారిని, శనివారం ఒక్కరోజే 432 మందికి మందికి జరిమానా విధించినట్లు బీఎంసీ తెలిపింది. రూ. 90,000 ఫైన్‌ రూపంలో వచ్చినట్లు వివరించింది. మాస్కు ధరించనివారికి మొదట్లో రూ .1,000 జరిమానా విధిస్తామని బీఎంసీ ప్రకటించింది. అయితే, ప్రజలనుంచి వ్యతిరేకత రావడంతో ఈ మొత్తాన్ని రూ. 200 కు తగ్గించింది. కాగా, మాస్కు ధరించకుండా పట్టుబడ్డవారు ఎక్కువగా వింతైన సాకులు చెబుతున్నారని బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు.