ఫ్లాష్‌న్యూస్: రాజమౌళికి షాక్.. RRR నుంచి తప్పుకోనున్న అలియా భట్!

| Edited By: Pardhasaradhi Peri

Mar 18, 2020 | 6:14 PM

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ సరసన ఇంగ్లీషు నటి ఒలివియా మెరిస్ నటిస్తుంటే.. చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి ఈమె తప్పుకుంటున్నట్లు తాజాగా ఓ వార్త హల్చల్

ఫ్లాష్‌న్యూస్: రాజమౌళికి షాక్.. RRR నుంచి తప్పుకోనున్న అలియా భట్!
Follow us on

దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు 70 శాతం వరకూ షూటింగ్ పూర్తయిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీలు నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఫస్ట్ సినిమా ఇది. దీంతో ఈప్రాజెక్ట్‌పై ఇద్దరి హీరోల అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది జులైలో రిలీజ్ కావాల్సి ఉండగా.. వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల రాజమౌళి తెలిపారు.

కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇంగ్లీషు నటి ఒలివియా మెరిస్ నటిస్తుంటే.. చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి ఈమె తప్పుకుంటున్నట్లు తాజాగా ఓ వార్త హల్చల్ అవుతోంది. దానికి కారణం కూడా ఉంది. పూణే షెడ్యూల్‌లో అలియా ఆర్ఆర్ఆర్ టీమ్‌తో జాయిన్ కానుందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవల అలియా పుట్టిన రోజున ఆర్ఆర్ఆర్ టీం విషెస్ కూడా తెలిపింది. అయితే ఏవో కారణాలతో పూణె షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తుంది. దీంతో.. అలియా ఆర్ఆర్ఆర్‌కి ఇచ్చిన డేట్స్ అయిపోనున్నాయి. అందులోనూ బాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్స్‌లో అలియా భట్ ఒకరు.

ఇప్పుడు ఆమె చేతిలో ఆర్ఆర్ఆర్‌తో పాటు గంగూబాయ్, సడక్ 2, బ్రహ్మస్త్ర ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో ప్రతీ ప్రాజెక్ట్‌కి పక్కా ప్లానింగ్‌తో డేట్స్ ఇచ్చింది అలియా భట్. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడుతుండటంతో.. డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టతరంగా మారిందట. ఒకవేళ అలియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే.. మరి ఎవరొస్తారనేది చూడాలి.

Read More this also: 

కరోనా ఎఫెక్ట్‌తో.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

‘చంద్రబాబు మృతి’ అంటూ వల్గర్ పోస్టులు.. మంగళగిరిలో కేసులు

హీరోయిన్‌ నమితకు చేదు అనుభవం.. పోర్న్ వీడియోలు బయటపెడతానంటూ..

దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం! 

ఇంటింటికి ఉచితంగా కిలో చికెన్ సప్లై.. గారెలతో కలిపి