Vidya Balan: లేటైనా అదరగొట్టేసింది.. శ్రీవల్లి పాటకు విద్యాబాలన్‌ స్టెప్పులు . వైరలవుతోన్న వీడియో..

Pushpa: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన చిత్రం పుష్ప (Pushpa). ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్‌ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Vidya Balan: లేటైనా అదరగొట్టేసింది.. శ్రీవల్లి పాటకు విద్యాబాలన్‌ స్టెప్పులు . వైరలవుతోన్న వీడియో..
Vidya Balan

Updated on: Mar 24, 2022 | 8:23 AM

Pushpa: క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా నటించిన చిత్రం పుష్ప (Pushpa). ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్‌ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిందీలోనూ వంద కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా విడుదలై ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. ఓటీటీలోనూ, టీవీల్లోనూ ప్రసారమైంది. అయితే పుష్పరాజ్‌ ఫీవర్‌ మాత్రం ఇంకా తగ్గడం లేదు. బన్నీ డైలాగులు, మేనరిజమ్స్ నెటిజన్లతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు, క్రికెటర్లు అనుకరిస్తున్నారు. వీటికి నెట్టింట్లోనూ మంచి స్పందన వస్తోంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ (Vidya Balan) కూడా ఈ జాబితాలో చేరింది. పుష్ప సినిమాలోని శ్రీవల్లి (Srivalli) సిగ్నేచర్‌ స్టెప్‌ను అనుకరించి అందరినీ ఖుషి చేసింది. విద్య స్టెప్ వేస్తున్న వీడియోని దేవిశ్రీ ప్రసాద్ ‘వావ్’ అంటూ తన ఇన్‌స్టాగ్రమ్‌ స్టేటస్‌లో పోస్ట్ చేయడం విశేషం. దీంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా ఈ వీడియోలో విద్యాబాలన్ నిండైన బ్లాక్‌ కలర్‌ శారీలో ఎంతో అందంగా కనిపించారు. శ్రీవల్లి స్టెప్‌కు తనదైన శైలిలో కాలుకదిపిన ఆమె చివరిలో ‘తగ్గేదే లే’ అని బన్నీ మ్యానరిజమ్‌ను ట్రై చేశారు. ఇక ఈ వీడియో చూసిన బన్నీ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. ‘లేటైనా.. విద్యాబాలన్ ఇరగదీసేశారు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది షేర్ని సినిమాతో ఆకట్టుకున్న విద్య ఈ ఏడాది జల్సా అనే సినిమాతో మెప్పించింది.

Also Read:Chennai Super Kings: IPL 2022లో కొత్త జెర్సీలో కనిపించనున్న సీఎస్కే ఆటగాళ్లు..

Lalu Prasad Yadav: క్షీణించిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం.. మళ్లీ ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు..

Shocking! ఒకే ఒక్క రోజులో కారు ఓనర్‌కి 51 చలానాలు.. రూ.6 లక్షలకు పైగా జరిమానా! ఎందుకో తెలుసా..