నాకు న్యాయం జరిగేలా చూడండి…

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కలిశారు. త‌నకు స‌త్వ‌ర న్యాయం జ‌రిగేలా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ మంత్రి కిష‌న్ రెడ్డికి పాయ‌ల్ లేఖను అంద‌జేశారు...

నాకు న్యాయం జరిగేలా చూడండి...

Updated on: Oct 08, 2020 | 5:46 AM

Actress Payal Ghosh : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కలిశారు. త‌నకు స‌త్వ‌ర న్యాయం జ‌రిగేలా చూడాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ మంత్రి కిష‌న్ రెడ్డికి పాయ‌ల్ లేఖను అంద‌జేశారు. ఇది చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య అని, ఇపుడు చ‌ర్య‌లు తీసుకునే స‌మ‌యం వ‌చ్చింద‌ని తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ఈ కేసులో త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ పాయ‌ల్ మంగ‌ళ‌వారం ఢిల్లీలోని జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ను ఆశ్ర‌యించి ఫిర్యాదు చేశారు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ త‌న‌ని లైంగికంగా వేధించాడ‌ని కొద్ది రోజుల క్రితం పాయ‌ల్ ఘోష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

పాయ‌ల్ ఘోష్ ఫిర్యాదు మేర‌కు ముంబై పోలీసులు అనురాగ్ కాశ్య‌ప్ పై అత్యాచారం కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో అనురాగ్ కాశ్య‌ప్ ను పోలీసులు సుమారు 8 గంటలు విచారించారు. పాయ‌ల్ త‌న‌పై చేస్తున్న ఆరోప‌ణలు నిరాధార‌మైన‌వ‌ని అనురాగ్ ఇప్ప‌టికే తీవ్రంగా ఖండించాడు.