ఈ దివ్యాంగుని పాట.. కరోనా రోగులకు ఊరట

|

Sep 30, 2020 | 5:16 PM

అతను అవడానికి దివ్యాంగుడే. కళ్ళు లేని అంధుడే. కానీ కరోనా కష్ట కాలంలో వైరస్ బారిన పడిన వారికి ఎంతో కొంత ఊరట కలిగించేందుకు యత్నిస్తున్నాడు.

ఈ దివ్యాంగుని పాట.. కరోనా రోగులకు ఊరట
Follow us on

Specially able person giving relaxation to corona patients: అతను అవడానికి దివ్యాంగుడే. కళ్ళు లేని అంధుడే. కానీ కరోనా కష్ట కాలంలో వైరస్ బారిన పడిన వారికి ఎంతో కొంత ఊరట కలిగించేందుకు యత్నిస్తున్నాడు. కరోనా వైరస్ బారిన పడి భయాందోళన మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వారికి తన పాట ద్వారా ఊరట నిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడా దివ్యాంగుడు.

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా బర్డురుకు చెందని తిరుమూర్తి పుట్టుకతోనే అంధుడు. అయితే… పాటలు పాడడం అతనికి అలవాటు. పాటకు తగ్గట్టుగా తాళం వేయడంలో దిట్ట. చేతికి దొరికి ఏదైనా వస్తువును వినియోగిస్తూ.. పాటకు తగినట్లుగా తాళం వేస్తూ గానం చేయడం తిరుమూర్తికి అలవాటు. ఇటీవల తిరుమూర్తి ఆలపించిన ఓ పాట ఇపుడు తమిళనాడు వైరల్‌గా మారింది.

నటుడు అజిత్ నటించిన విశ్వాసం సినిమాలోని పాటని పాడిన తిరుమూర్తి ఆ వీడియో ద్వారా ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండవుతున్నాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన సంగీత దర్శకుడు ఇమ్మాన్ సినిమాకు పాట పాడే అవకాశం కల్పించాడు. తాజాగా ఇతనికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో తాను చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో సహా రోగులకు ఊరట నిచ్చేందుకు పాటలు పాడుతున్నాడు. ఇటీవల మరణించిన సుప్రసిద్ద నేపథ్యం గాయకుడు బాలసుబ్రహ్మణ్యంకు అంజలి ఘటిస్తూ పాటలు పాడుతున్న తిరుమూర్తి.. సహా రోగులకు ఎంతో కొంత ఊరట నిస్తున్నాడు. ఆసుపత్రిలో పాటలు పాడుతున్న ఈ వీడియోలిపుడు తమిళనాట వైరల్‌గా మారాయి.

Also read:    క్రెడిట్ డెబిట్ కార్డుల వినియోగంపై ఆంక్షలు.. రేపట్నించే అమలు

Also read:    ఏపీతోపాటే కేంద్రానికి ధీటుగా సమాధానం.. యాక్షన్ ప్లాన్‌పై కేసీఆర్ కసరత్తు

Also read:    బ్రహ్మోస్ ప్రయోగం సక్సెస్.. రేంజ్ తెలిస్తే షాకే!