ఆర్మీ రైఫిల్ క్యాంపులో పేలుళ్లు.. ఇద్దరు జవాన్లకు గాయాలు

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Apr 05, 2019 | 2:44 PM

శ్రీనగర్‌ : కుప్వారా జిల్లాలోని హంద్వారా సెక్టార్‌లో పేలుళ్లు సంభవించాయి. లచ్చంపురా ఏరియాలోని 15వ రాష్ట్రీయ రైఫిల్ క్యాంపు ఆయిల్ డిపో వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. గాయపడ్డ జవాన్లను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పేలుళ్లు సంభవించిన ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కాగా ఈ ఏడాది జనవరిలో షోపియాన్ […]

ఆర్మీ రైఫిల్ క్యాంపులో పేలుళ్లు.. ఇద్దరు జవాన్లకు గాయాలు

శ్రీనగర్‌ : కుప్వారా జిల్లాలోని హంద్వారా సెక్టార్‌లో పేలుళ్లు సంభవించాయి. లచ్చంపురా ఏరియాలోని 15వ రాష్ట్రీయ రైఫిల్ క్యాంపు ఆయిల్ డిపో వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. గాయపడ్డ జవాన్లను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పేలుళ్లు సంభవించిన ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కాగా ఈ ఏడాది జనవరిలో షోపియాన్ జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu