Black Magic: పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజల నేపథ్యంలో జనం వణికిపోతున్నారు. సుల్తానాబాద్ శివారులోని నీరుకుల్ల రోడ్డు సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. క్షుద్ర పూజల ఆనవాళ్లు స్థానికులను భయభ్రాంతులకు గురవతున్నారు. పూజలు చేసిన ప్రాంతంలో నిమ్మకాయలు, కోడిగుడ్లు, మనిషి బొమ్మ ఆకారంలో ఓ చిత్రాన్ని గీశారు. దానిపై వికృతంగా పసుపు, కుంకుమ చల్లారు. దీంతో అటు వైపు నుండి వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. రాత్రిపూట క్షుద్రపూజలు చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
ఏది ఏమైనా గ్రామ శివారు ప్రాంతాల్లో క్షుద్రపూజలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్‌కు ముందు కనుగొంటున్న ఈరోజుల్లో ఇంకా మూఢ నమ్మకాల ఊబిలోనెే ప్రజలు ఉండటం గమనార్హం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:
నిమ్మరసంతో కమ్మనైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకుందాం పదండి..
దారుణం.. మద్యం మత్తులో కన్నకొడుకుపైనే తల్లి పైశాచికం.. బ్లేడుతో…