పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్‌పై దాడిపై ఆమె స్పందించారు. బీజేపీ కార్యకర్తలే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు తెగబడతారని ఆరోపించారు. ఇతరులపై దాడులు చేసే బీజేపీ నేతలు తమపై అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.
పశ్చిమ బెంగాల్ లో కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పై, ఆయన కాన్వాయ్ పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులుగా భావిస్తున్న వారు రాళ్లు, రాడ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు, విండో స్క్రీన్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. గవర్నర్‌ను వివరణ ఇవ్వాల్సిందిగా కోరారు. తాజా సమాచారం ప్రకారం అమిత్ షా డిసెంబర్ 19 లేదా 20 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు.