GHMC Election Results 2020 : గ్రేటర్లో కారు స్పీడ్‌ను కంట్రోల్‌ చేసిన కమలం.. తెలంగాణలో ప్రత్యామ్నయంగా మారిన లోటస్‌

|

Dec 05, 2020 | 6:03 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయజనతాపార్టీ ఈ సారి గట్టి పోటీయే ఇచ్చింది. చాలా డివిజన్లలో...

GHMC Election Results 2020 : గ్రేటర్లో కారు స్పీడ్‌ను కంట్రోల్‌ చేసిన కమలం.. తెలంగాణలో ప్రత్యామ్నయంగా మారిన లోటస్‌
Follow us on

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయజనతాపార్టీ ఈ సారి గట్టి పోటీయే ఇచ్చింది. చాలా డివిజన్లలో పోరు టగ్ ఆఫ్ వార్ నడిచింది. మొదటి నుంచి గెలుపుపై ధీమా ఉన్నప్పటికీ.. బీజేపీ దెబ్బకి అధికార పార్టీలో గుబులు స్పష్టంగా కనిపించింది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపుతో దూకుడుగా ఉన్న బీజేపీ.. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని గ్రేటర్‌లో మరింత బలం సంతరించుకోవాలని చేసిన ప్రయత్నంలో కొంత వరకు సఫలీకృతం అయిందనే చెప్పాలి. ఈ మధ్యనే కొత్తగా బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్‌కి దుబ్బాక ఫలితం మంచి బూస్ట్‌ అనే చెప్పాలి. ఆ ఊపులోనే.. బండి సంజయ్ గ్రేటర్‌‌ ఎన్నికల్లోనూ దూకుడుగా వ్యవహరించారు. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇవి ఏదో అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. కావాలనే ఆ కామెంట్‌ చేశారని అన్న వారు కూడా ఉన్నారు. అది కాస్తా పార్టీకి ఇబ్బందిగానే మారిందని ఫలితాల తర్వాత అర్ధమవుతోంది. ఇక ఈ గ్రేటర్‌ పోరులో మతం కీలకమైన అంశంగా మారింది. అభివృద్ది నినాదం పక్కకు పోయి మతం చుట్టూనే రాజకీయం తిరిగింది. బీజేపీ వేసిన ఈ వ్యూహాత్మక ఎత్తుగడలో గులాబీ పార్టీ చిక్కుకుంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావించినా.. అది అంతగా ప్రభావం చూపకపోయింది.

హిందుత్వవాదంతో ఓట్ల పోలరైజేషన్‌ అవుతందని భావించినా అది ఎక్కువ కనిపించలేదు. చాలా చోట్ల కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకున్న బీజేపీ.. రెండవ స్థానంలో నిలబడింది. ముందు, ముందు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నయం అన్న సవాల్‌ మాత్రం విసిరింది. ఇక ముందు జరిగే ఏ ఎన్నికల్లోనైనా.. తామే టీఆర్‌ఎస్‌కు పోటీ అన్నది మాత్రం లోటస్‌ శ్రేణులు నిరూపించుకున్నారు. గతంలో కాంగ్రెస్‌ పోషించిన పాత్రను ఇక నుంచి బీజేపీ కైవసం చేసుకోనుంది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా 66 డివిజన్లలో పోటీచేసిన బీజేపీ నాలుగు స్థానాల్లో గెలుపొంది, 35 స్థానాల్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నప్పటికీ.. ఈ సారి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అవసరమైన చోట్ల ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన అభ్యర్థులను చేర్చుకోవడం ద్వారా తమకు బలం లేని చోట కూడ గట్టి పోటీ ఇచ్చి.. 80కి పైగా స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. పాతబస్తీలో కూడా పలు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టి రెండవ స్థానంలో నిలించింది. పలు డివిజన్లలో ఎంఐఎంకి కూడా గట్టి పోటీ కూడా ఇచ్చింది.