లంకా దినకర్‌కి షోకాజ్ నోటీస్‌

బీజేపీ నేత లంకా దినకర్‌కు రాష్ట్ర శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గురికి నోటీసులు జారీ చేశారు.

లంకా దినకర్‌కి షోకాజ్ నోటీస్‌

Edited By:

Updated on: Jul 28, 2020 | 8:25 AM

Lanka Dinakar: బీజేపీ నేత లంకా దినకర్‌కు రాష్ట్ర శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గురికి నోటీసులు జారీ అయ్యాయి. తరచూ టీవీ చర్చల్లో పాల్గొనడం, పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని వీరికి నోటీసులు జారీ అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా సుదీర్ఘకాలం పాటు టీడీపీలో కొనసాగిన లంకా దినకర్‌.. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత బీజేపీలో చేరారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలను కొందరు టీడీపీ నేతలకు చేరవేస్తున్నట్లు దినకర్‌పై ఆరోపణలు ఉన్నాయి. కాగా మరోవైపు పార్టీ మూల సిద్ధాంతాలకు భిన్నంగా ప్రవర్తిస్తోన్న నేతలకు చెక్ పెట్టేలా రాష్ట్ర బీజేపీ వ్యూహాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.

Read This Story Also: కరోనా నుంచి కోలుకున్న అర్జున్ తనయ