సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ నిలిచే బీజేపీ ఎమ్మల్యే రాజాసింగ్ ఇవాళ మరోసారి తన నోటికి పనిచెప్పారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్ తో తమకు ఎటువంటి సంబంధాలూ అవసరం లేదని.. పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా కేసీఆర్ జన్మదిన వేడుకలను రద్దు చేసుకోవడం హర్షణీయమన్నారు. పాకిస్థాన్ కోడలు సానియా విషయంలో పునరాలోచించాలన్నారు. సానియా మీర్జాను కాకుండా తెలంగాణ బిడ్డలైన పీవీ సింధు లేదా సైనా నెహ్వాల్ లాంటి క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని కోరారు.