Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసెంబ్లీకి మిడతల బుట్టతో ఎమ్మెల్యే..ఎందుకో తెలుసా..?

నిరసన తెలియజేయడం ప్రజల హక్కు. ప్రజాప్రతినిధులకు కూడా ఆ స్వాతంత్య్రం ఉంటుంది. చట్ట సభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు వివిధ పద్దతుల్లో తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాజీ ఎంపీ, దివంగత శివప్రసాద్..ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ ఆవరణలో వివిధ వేశాలు వేసి..అటెన్షన్ గ్రాబ్ చేశారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే కూడా వినూత్న రీతిలో నిరసనను వ్యక్తపరిచి వార్తల్లోకెక్కారు. బిజెపి ఎమ్మెల్యే బిహారీ లాల్ నోఖా శుక్రవారం రాజస్థాన్ అసెంబ్లీకి ఒక మిడుత బుట్టతో […]

అసెంబ్లీకి మిడతల బుట్టతో ఎమ్మెల్యే..ఎందుకో తెలుసా..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 24, 2020 | 5:31 PM

నిరసన తెలియజేయడం ప్రజల హక్కు. ప్రజాప్రతినిధులకు కూడా ఆ స్వాతంత్య్రం ఉంటుంది. చట్ట సభల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు వివిధ పద్దతుల్లో తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాజీ ఎంపీ, దివంగత శివప్రసాద్..ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ ఆవరణలో వివిధ వేశాలు వేసి..అటెన్షన్ గ్రాబ్ చేశారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే కూడా వినూత్న రీతిలో నిరసనను వ్యక్తపరిచి వార్తల్లోకెక్కారు.

బిజెపి ఎమ్మెల్యే బిహారీ లాల్ నోఖా శుక్రవారం రాజస్థాన్ అసెంబ్లీకి ఒక మిడుత బుట్టతో వెళ్లారు. ఇటీవల కాలంలో పాకిస్థాన్‌లో ఎడారి ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వచ్చిన మిడతలు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలోని పంటలపై దాడి చేశాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షల హెక్టార్లలో పంట నాశనమైంది. దీంతో ఎమ్మెల్యే బిహారీ రైతుల ఆవేదనను అద్దం పట్టేందుకు మిడదలతో అసెంబ్లీకి వచ్చారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 

కాగా ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బార్మర్ రైతులను కలుసుకున్నారు. ఈ స్థాయిలో పంటలు నాశనమవ్వడం రెండు దశాబ్దాలలో ఇదే మొదటిసారి అని రైతులు ఆయన ముందు వాపోయారు. వ్యవసాయ కార్యదర్శి కె.ఎస్. పన్ను పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  రాజస్థాన్ వ్యవసాయ నిపుణులతో పాటు భారత ప్రభుత్వంతో కూడా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని భయపడవద్దని రైతులకు భరోసానిచ్చారు.