టీఆర్ఎస్ ఎంపీ ఇలాకాలో బీజేపీ పైచేయి

|

Nov 10, 2020 | 2:40 PM

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ఫలితాల్లో కారు జోరుగా దూసుకొస్తుంది

టీఆర్ఎస్ ఎంపీ ఇలాకాలో బీజేపీ పైచేయి
Follow us on

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ఫలితాల్లో కారు జోరుగా దూసుకొస్తుంది. మొదటి పది రౌండ్ల కౌంటింగ్ ముగిసిన తరువాత, బీజేపీ అన్ని రౌండ్లలోనూ ఎంతో కొంత ఆధిక్యాన్ని చూపిస్తూ వచ్చింది. తదుపరి రౌండ్ ఫలితం నుంచి అధికార టీఆర్ఎస్ హవా కొనసాగిస్తోంది. కాగా, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఆయన స్వగ్రామమైన పోతారంలో బీజేపీ 110 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి నామమాత్రపు ప్రభావాన్నే చూపుతున్నారు. చివరి రౌండ్లలో పుంజుకుంటుండటంతో టీఆర్ఎస్ సంతోషం వ్యక్తమవుతోంది.