బీజేపీ తరపున మంచి అభ్యర్థుల్ని రంగంలోకి దించాం.. కమలం గుర్తుకే ఓటెయ్యండి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అక్రమార్కులు, దుర్మార్గులకు తావులేకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున మంచి అభ్యర్థుల్ని రంగంలోకి దించామని..

బీజేపీ తరపున మంచి అభ్యర్థుల్ని రంగంలోకి దించాం.. కమలం గుర్తుకే ఓటెయ్యండి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Updated on: Nov 29, 2020 | 9:51 PM

అక్రమార్కులు, దుర్మార్గులకు తావులేకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున మంచి అభ్యర్థుల్ని రంగంలోకి దించామని.. కమలం గుర్తుకే ఓటేసి వారిని గెలిపించి బల్దియాపై కమలం వికసించేలా సహకరించాలని హైదరాబాద్ ప్రజలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విన్నవించారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న తరుణంలో ఒక 40 నిమిషాల ముందు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. బన్సీలాల్ పేటలో పేద అభ్యర్థికి కార్యకర్తలే ఆర్థికంగా అండగా నిలిచారని కిషన్ రెడ్డి చెప్పారు. మా ప్రచారంలో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిధులిచ్చారని ఆయన వెల్లడించారు. టీఆర్ఎస్ లా తమది కుటుంబపార్టీ కాదని కిషన్ రెడ్డి అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us