పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తోన్న బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురయ్యింది. టీఎంసీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌పై రాళ్లు, ఇటుకలతో దాడికి పాల్పడ్డారు. గురువారం నడ్డా కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు కోల్‌కతాలోని డైమండ్ హార్బర్‌కు వెళుతుండగా..టీఎంసీ కార్యకర్తలు అడ్డకునే ప్రయత్నం చేశారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చుని..బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో నడ్డా ప్రయాణిస్తోన్న కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేశారు. ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగి.. పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. నడ్డా కాన్వాయ్‌ను అక్కడి నుంచి భద్రత నడుమ ముందుకు తీసుకెళ్లారు. దాడికి సంబంధించిన వీడియోని బీజేపీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గియా ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడి కారుపై రాళ్లదాడికి పాల్పడటాన్ని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అయితే ఈ ఆరోపణలను టీఎంసీ నేతలు కొట్టిపారేశారు. బీజేపీ వ్యక్తులే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వారు బయటి వ్యక్తులను రాష్ట్రంలోకి అనుమతించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
बंगाल पुलिस को पहले ही राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी के कार्यक्रम की जानकारी दी गई थी, लेकिन एक बार फिर बंगाल पुलिस नाकाम रही। सिराकोल बस स्टैंड के पास पुलिस के सामने ही #TMC गुंडों ने हमारे कार्यकर्ताओं को मारा और मेरी गाड़ी पर पथराव किया। #BengalSupportsBJP pic.twitter.com/G882Ewhq9M
— Kailash Vijayvargiya (@KailashOnline) December 10, 2020
Also Read : Bigg Boss Telugu 4 : అభిజీత్ అభిమానుల ఆశలు గల్లంతు, తొలిసారి తెలుగు బిగ్ బాస్ కిరీటం ‘ఆమె’ ఖాతాలో