చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల ఆధారంగా వచ్చిన చాలా సినిమాలు విజయం సాధించాయి. తమ ఇష్టమైన నటుడు, క్రీడాకారుడు, రాజకీయ నేత, బిజినెస్ మ్యాన్ గురించి సినిమా వస్తే అభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. నిజ జీవితానికి అద్దం పట్టినట్లుగా ఉండే సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఇందుకు ఎంతోమంది మహానుభావుల బయోపిక్‌లే ఉదాహరణగా చెప్పవచ్చు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా భారతీయ కార్పొరేట్ దిగ్గజం రతన్ టాటా బయోపిక్ కూడా ఇందులో చేరబోతోంది. ఇందులో హీరోగా బాలీవుడ్ సీనియర్ హీరో మాధవన్ నటిస్తాడని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వ్యాపార పరంగా ఎన్నో విజయాలు, మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన రతన్ టాటా బయోపిక్ అందరికి ఆదర్శంగా నిలుస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించిన వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.. బయెపిక్‌ల సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటం చేత ఈ సినిమాల నిర్మాణానికి మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. మినిమమ్ గ్యారెంటీగా ఉంటాయని నిర్మాతల నమ్మకం. ఇటీవల ఎయిర్ డెక్కన్ కెప్టెన్ గోపినాథ్ కథతో సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా.. సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. అలాగే కపిల్ దేవ్ కథతో 83 సినిమా నిర్మాణంలో ఉండగా బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌లు ప్రారంభమై షూటింగ్ కూడా చేసుకుంటున్నాయి.
Also Read : కాంగ్రెస్ నేతల ప్రచారం పచ్చి అబద్దం… ఇదీ వాస్తవం అంటూ వీడియో షేర్ చేసిన బీజేపీ…