Bike Prices: బైక్‌ల ధరలను పెంచేసిన ప్రముఖ టూవీలర్‌ తయారీ కంపెనీలు.. ఏ బైక్‌ ధర ఎంత పెరిగిందంటే..

|

Jan 13, 2021 | 5:50 AM

Bike Prices Increased: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు బజాజ్‌, టీవీఎస్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తమ కంపెనీ బైక్‌ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. టీవీఎస్‌ కంపెనీ అపాజీ బైక్‌ ధరను..

Bike Prices: బైక్‌ల ధరలను పెంచేసిన ప్రముఖ టూవీలర్‌ తయారీ కంపెనీలు.. ఏ బైక్‌ ధర ఎంత పెరిగిందంటే..
Follow us on

Bike Prices Increased: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు బజాజ్‌, టీవీఎస్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తమ కంపెనీ బైక్‌ల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. టీవీఎస్‌ కంపెనీ అపాజీ బైక్‌ ధరను పెంచగా, బజాజ్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీకి చెందిన అన్ని బైక్‌ల ధరలను పెంచేశాయి. పెరిగిన ఈ ధరలు 2021, జనవరి నుంచి తయారు చేసిన, విక్రయించే బైక్‌లు, స్కూటర్లపై వర్తిస్తాయని సదరు కంపెనీలు తెలిపాయి.

ఏ బైక్‌పై ఎంత ధర పెరిందంటే..

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ధరలను రూ.3 వేలకు పెంచింది. ఇక అపాచీ ఆర్టీఆర్ 200 4వీ ధరను రూ.2,000 పెరిగి 1.33 లక్షలకు లభిస్తుంది. అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ధర రూ.1,770, ఆర్టీఆర్ 180 ధర రూ.1770, ఆర్టీఆర్ 160 ధర రూ.1520 పెరిగాయి. ఇక రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ తన ఆర్ఈ క్లాసిక్ 350 ధరలను సుమారు రూ.2,000 పెంచింది. ఇక మరో ప్రముఖ ఆటో మోబైల్‌ కంపెనీ బజాజ్‌.. తన అవెంజర్ క్రూయిజర్ 220 ధరలను 3,521 రూపాయలు పెంచింది. మరో వైపు పల్సర్ 220ఎఫ్ ధరను రూ.3,500 పెంచడంతో అది రూ.1.25 లక్షలకు చేరుకుంది. ఎన్‌ఎస్‌160ని రూ. 3000, ఎన్ఎస్‌ 200 ధరను రూ.3,500 పెంచినట్లు కంపెనీ ప్రకటించింది.

Also Read: Samsung Galaxy S21 Series: సరికొత్త ఫీచర్లతో శాంసంగ్‌ గెలక్సీ ఎస్‌21 సిరీస్‌లో స్మార్ట్‌ ఫోన్‌