బీహార్ లో బీజేపీ అధికార ప్రతినిధిపై కాల్పులు జరిపిన దుండగులు, తోటి ప్రొఫెసర్ కక్షే కారణమా ?

బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి అజఫర్ షంషీ పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ముంగేరీలో  ఆయనపై ఇద్దరు, ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.

బీహార్ లో  బీజేపీ అధికార ప్రతినిధిపై కాల్పులు జరిపిన దుండగులు,  తోటి ప్రొఫెసర్ కక్షే కారణమా ?

Edited By:

Updated on: Jan 27, 2021 | 5:02 PM

బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి అజఫర్ షంషీ పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ముంగేరీలో  ఆయనపై ఇద్దరు, ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.  ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఈయన జమాల్ పూర్ లో  తన కాలేజీ లోని ఛాంబర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. తోటి ప్రొఫెసర్ తో  అఫ్జర్ షంషీకి విభేదాలు ఉన్నాయని, తనను పోలీసులు అరెస్టు చేయడంతో ఆ ప్రొఫెసర్ కక్ష గట్టి ఈ హత్యాయత్నం చేయించాడని ఈయన చెప్పినట్టు ఖాకీలు తెలిపారు. ఈ కేసులో ఒకరిని వారు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.