ధనం, కండబలం, మోసం, ప్రధాని మోదీ, నితీష్ కుమార్ లపై తేజస్వి యాదవ్ ధ్వజం, అసలైన విజయం మాదే ! నో డౌట్
బీహార్ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు తనకే అనుకూలంగా ఉందని, ఎవరో వ్యక్తి సీఎం కుర్చీపై కూర్చున్నా తనే విజేతనని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, నితీష్ కుమార్ ఇద్దరూ ఈ ఎలెక్షన్స్ లో ధనాన్ని, కండబలాన్ని వినియోగించారని, ప్రజలను తప్పుదారి పట్టించారని ఆయన ధ్వజమెత్తారు. కానీ ఏకైక అతి పెద్ద పార్టీగా తమ పార్టీ అవతరించడాన్ని వారు ఆపలేకపోయారన్నారు. ‘నితీష్ పర్ఫామెన్స్ ఎక్కడికి పోయింది […]

బీహార్ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు తనకే అనుకూలంగా ఉందని, ఎవరో వ్యక్తి సీఎం కుర్చీపై కూర్చున్నా తనే విజేతనని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, నితీష్ కుమార్ ఇద్దరూ ఈ ఎలెక్షన్స్ లో ధనాన్ని, కండబలాన్ని వినియోగించారని, ప్రజలను తప్పుదారి పట్టించారని ఆయన ధ్వజమెత్తారు. కానీ ఏకైక అతి పెద్ద పార్టీగా తమ పార్టీ అవతరించడాన్ని వారు ఆపలేకపోయారన్నారు. ‘నితీష్ పర్ఫామెన్స్ ఎక్కడికి పోయింది ? మూడో స్థానానికి ఆయన దిగజారారు. ఆయన సీఎం కుర్చీలో కూర్చున్నారు..కానీ మేం ప్రజల హృదయాల్లో ఉన్నాం’ అని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. అనేక నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులకు, ప్రత్యర్థి అభ్యర్థులకు మధ్య స్వల్ప ఆధిక్యమే ఉందని చెప్పిన ఆయన.. ఓట్లను తిరిగి లెక్కించాలని డిమాండ్ చేశారు. నిజానికి మహాఘట్ బంధన్ కి అనుకూలంగానే ప్రజాతీర్పు ఉందని, నితీష్ దొడ్డిదారిన రావాలనుకున్నారని తేజస్వి అన్నారు.
బీహార్ ఎన్నికల్లో 84,900 ఓట్లు మాత్రమే ఎన్డీయేకి ‘తోడ్పడ్డాయని’ ఈసీ వెల్లడించింది. ఎన్డీయేకి, మహాఘట్ బంధన్ కి మధ్య పోలైన ఓట్లు 0.2 శాతం మాత్రమే అని స్పష్టం చేసింది.