మాస్క్ ముఖానికి కానీ వినోదానికి కాదంటూ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 వీర లెవెల్‌లో ప్రారంభమైంది. 16 మంది కంటెస్టెంట్లు కూడా హౌస్‌లోకి ఎంటర్ అయిపోయారు. అయితే వారిలో కొంతమంది పెద్దగా జనాలకు తెలియదు. ఇదిలా ఉంటే యూట్యూబ్ ‘మై విలేజ్ షో’ ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ కూడా ఈ సీజన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ 4కు గంగవ్వ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. ఇక గంగవ్వకు అప్పుడే సోషల్ మీడియాలో విపరీతమైన మద్దతు లభిస్తోంది. మున్ముందు బిగ్ బాస్ హౌస్‌లో ఆమె ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ ఉంది. (Bigg Boss 4 Elimination Process)
ఇక బిగ్ బాస్ హౌస్‌లో మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. హౌస్ సభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో.. వారి పేరు చెప్పి.. వారి మొహం మీద కిటికీలను మూసివేయాలి. ఎవరికి వారు.. వారి అభిప్రాయాలు చెప్పి నామినేట్ చేశారు. చివరికి గంగవ్వ వంతు వచ్చింది. అభిజిత్, దేత్తడి హారికలు నామినేషన్‌లో ఉండగా.. వారిద్దరిలో ఎవరిని నామినేట్ చేస్తావని జోరుదర్ సుజాత, లాస్య.. గంగవ్వను అడిగారు. ” ఎవరూ ఎందుకు.. వాళ్లిద్దరూ కూడా మొన్ననే వచ్చారు. ఉండనీ” అంటూ గంగవ్వ సమాధానం చెప్పడంతో.. హౌస్‌లో నవ్వులు పూశాయి. ఇలా మొదటి ఎలిమినేషన్‌కే గంగవ్వ బిగ్ బాస్‌కు పంచ్ ఇస్తే.. మున్ముందు ఎన్ని పంచులు ఇస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా గంగవ్వ హౌస్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని అందరి మాట.