బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్‌లో గెస్ట్‌గా సూపర్ స్టార్.? ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన నాగ్..

|

Dec 08, 2020 | 5:19 PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చివరికి చేరుకుంది. మరో రెండు వారాల్లో షో‌కు ఎండ్ కార్డు పడనుంది. వైల్డ్ కార్డు ఎంట్రీలతో కలిపి హౌస్‌లోకి...

బిగ్ బాస్ 4 ఫైనల్ ఎపిసోడ్‌లో గెస్ట్‌గా సూపర్ స్టార్.? ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన నాగ్..
Follow us on

Bigg Boss 4: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చివరికి చేరుకుంది. మరో రెండు వారాల్లో షో‌కు ఎండ్ కార్డు పడనుంది. వైల్డ్ కార్డు ఎంట్రీలతో కలిపి హౌస్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టగా.. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఇక వీరిలో ఒకరు ఈ వీకెండ్‌కు ఎలిమినేట్ కానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బిగ్ బాస్ షోను ఆదరిస్తున్న ప్రేక్షకులకు హోస్ట్ అక్కినేని నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోకు తాను హోస్టుగా వ్యవహరించడం ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందని ఆయన అన్నారు.

కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో మొదలైన బిగ్ బాస్ సీజన్ 4.. గత సీజన్ల రికార్డులను తిరగరాయడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ సీజన్ 20+ టీవీఆర్‌తో బిగ్‌బాస్‌ షోలలో అతిపెద్ద ఆవిష్కరణగా నిలిచిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 83 శాతం వీక్షకులు ఈ సీజన్ 4ను చూశారని తెలిపారు. ఇప్పటిదాకా ఒక ఎత్తయితే.. షో ఫైనల్ మరో ఎత్తని నాగార్జున అన్నారు. ఎంతగానో ఆసక్తిని కలిగిస్తుందని వ్యక్తం చేశారు. కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ షో టైం స్లాట్ మారింది. ప్రతీ రోజూ రాత్రి 10 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతోంది. ఇక బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్‌గా వస్తారని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది.