AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss4 : నవ్విస్తూ వీడుకోలు చెప్పిన అవినాష్.. వెళ్తూ వెళ్తూ అభిజిత్ పై బిగ్‌బాంబ్‌

బిగ్ బాస్ పై ప్రేక్షకులకు రోజు రోజుకు ఆసక్తి పెనుగుతుంది. ఆదివారం వచ్చిందంటే   ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారా అని అంతా టీవీలకు అతుక్కుపోతున్నారు.

Bigg Boss4 : నవ్విస్తూ వీడుకోలు చెప్పిన అవినాష్.. వెళ్తూ వెళ్తూ అభిజిత్ పై బిగ్‌బాంబ్‌
Rajeev Rayala
|

Updated on: Dec 07, 2020 | 9:02 AM

Share

బిగ్ బాస్ పై ప్రేక్షకులకు రోజు రోజుకు ఆసక్తి పెనుగుతుంది. ఆదివారం వచ్చిందంటే ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారా అని అంతా టీవీలకు అతుక్కుపోతున్నారు. అనుకున్నట్టుగానే ఈ వారం అవినాష్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. గత కొద్ది వారాలుగా ఎలిమినేషన్ నుంచి బయటపడుతూ వస్తున్న అవినాష్ ఈ సారి తప్పించుకోలేక పోయాడు. ఇన్ని రోజులు మోనల్ ను వీక్ అని చెప్పిన అవినాష్ హౌస్ నుంచి వెళ్లిపోయేటప్పుడు మాత్రం మోనాల్ స్ట్రాంగ్ అంటూ చెప్పుకొచ్చాడు. వెళ్తూ వెళ్తూ అందరిని కడుపుబ్బా నవ్వించాడు.

ఎలిమినేషన్స్‌లో ఉన్నవారిలో చివరిగా అవినాష్, మోనల్ మిగిలారు. వీళ్లిద్దరి ముందు రెండు గాజు బౌల్స్ ఉంచారు. ఒక్కొక్కరికి ఒక్కో టెస్ట్ ట్యూబ్ ఇచ్చారు. ఈ టెస్ట్ ట్యూబ్స్‌లో ఉన్న ద్రావణాన్ని ఇద్దరూ ఒకేసారి ఎవరి బౌల్‌లో వారు పోయాలి. ఎవరి నీరు ఎరుపు రంగులోకి మారితే వాళ్లు ఎలిమినేట్ అయినట్టు. అవినాష్ బౌల్‌లో నీళ్లు ఎరుపు రంగులోకి మారాయి. మోనల్ నీళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాయి. దీంతో అవినాష్ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను ఇమిటేట్ చేసి చూపించాడు అవినాష్. ఒక్కొక్కరిని ఇమిటేట్ చేస్తుంటే నాగార్జున పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. ముఖ్యంగా హారికను ఇమిటేట్ చేసటప్పుడు ప్రేక్షకులు తెగ నవ్వుకున్నారు. ఇక అవినాష్ వెళ్లిపోతుంటే మోనల్ బోరుమంది. అరియనా కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అయితే అందరిని నవ్వించిన అవినాష్ అరియనాను మాత్రం నవ్వించలేక పోయాడు. దాంతో నాగార్జున అరియనను నవ్వించాల్సిందే అనడంతో ఆమెను ఇమిటేట్ చేసి అరియనా మొఖం పై చిరునవ్వు తెప్పించాడు. నీకోసం ఎదురు చూస్తుంటాన‌ని, ఏడ‌వొద్ద‌ని ఆమెను ఊర‌డించాడు. అనంత‌రం వారం రోజులు ఏ ప‌నీ చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్న బిగ్‌బాంబ్‌ను అవినాష్‌ అభిజిత్ మీద వేశాడు.

Follow Us
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..