బిగ్ బాస్ సీజన్ 4 చివరకు వచ్చేసింది. గత సీజన్స్ లానే ఈ సీజన్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇంటి సభ్యులు ఒకరోజు గొడవలు పడతారు మరోరోజు కలిసిపోతారు. ఈ సీజన్ లో బిగ్ బాస్ హూస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన అఖిల్ సోహెల్ మధ్య కూడా ఇలానే జరుగుతుంది. కష్ట సమయం వచ్చినప్పుడు అఖిల్ కోసం సోహెల్ , సోహెల్ కోసం అఖిల్ నిలబడుతూ.. వారిమధ్య ఫ్రెండ్ షిప్ ను చాటుకుంటున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ఈ ఇద్దరు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఈ ఇద్దరు మళ్ళీ గొడవ పడ్డారు. అంతకు ముందు జరిగిన డిస్కషన్ లో ఈ ఇద్దరు ఓ డీల్ ను సెట్ చేసుకున్నారు.
ఇద్దరు కూర్చొని బిగ్ బాస్ విన్నర్ అయితే ఎం చేస్తారో మాట్లాడుకున్నారు. ఇంట్లో ఖాళీగా ఉంటే ఎం చేస్తావ్.? అని అఖిల్ సోహెల్ ను అడిగాడు. ఏముంది సినిమాలు చూస్తా అని సమాధానం ఇచ్చాడు సోహెల్..ఎందులో చూస్తావ్.? అని అఖిల్ మళ్లీ అడిగాడు.. ఫోన్లో చూస్తా నాకు ల్యాప్ టాప్ లేదు. రూమ్ లో ఎవడో కొట్టేసాడు అంటూ చెప్పుకొచ్చాడు సోహెల్. దానికి అఖిల్ నా దగ్గర కూడా ల్యాప్ టాప్ లేదు అన్నాడు. నేను టైటిల్ విన్ అయితే నీకు ల్యాప్ టాప్ కొనిస్తా అని సోహెల్ అన్నాడు. దానికి అఖిల్ నేను బిగ్ బాస్ విన్నర్ అయితే నీకు బైక్ , ల్యాప్ టాప్ కొనిస్తా నువ్వు విన్ అయితే నాకు కొనివ్వాలి అంటూ డీల్ మాట్లాడుకున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అనేదాని పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అభిజిత్ టైటిల్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కొందరు అంటుంటే ఈ సారి అమ్మాయిలకు ఛాన్స్ ఉంటుందేమో అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో..