Bigg Boss 3 Winner: బిగ్‌బాస్ 3 విజేతపై బీరు సీసాలతో దాడి.. తలకు తీవ్ర గాయాలు..

Bigg Boss 3 Winner: బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జరిగింది. హైదరాబాద్‌లోని ఓ పబ్బులో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాహుల్ తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలి‌లోని ఓ పబ్‌కు వెళ్లగా.. కొంతమంది యువకులు అతడి వెంట వచ్చిన అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. వారిని నిలదీయడంతో రాహుల్ తలపై బీరు సీసాలతో కొట్టారు. దీంతో తీవ్ర రక్తస్రావమై రాహుల్‌ను దగ్గరలో ఉన్న కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకుని […]

Bigg Boss 3 Winner: బిగ్‌బాస్ 3 విజేతపై బీరు సీసాలతో దాడి.. తలకు తీవ్ర గాయాలు..

Updated on: Mar 05, 2020 | 2:40 PM

Bigg Boss 3 Winner: బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జరిగింది. హైదరాబాద్‌లోని ఓ పబ్బులో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రాహుల్ తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలి‌లోని ఓ పబ్‌కు వెళ్లగా.. కొంతమంది యువకులు అతడి వెంట వచ్చిన అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. వారిని నిలదీయడంతో రాహుల్ తలపై బీరు సీసాలతో కొట్టారు. దీంతో తీవ్ర రక్తస్రావమై రాహుల్‌ను దగ్గరలో ఉన్న కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకుని సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వికారాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. కాగా కంప్లైంట్ చేస్తే తన వెంట వచ్చిన అమ్మాయిలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే రాహుల్ సైలెంట్‌గా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ తర్వాత రాహుల్ ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్షన్‌లో రంగమార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అటు పలు ప్రమోషనల్ సాంగ్స్‌తో పాటు ప్రైవేట్ షోలను సైతం నిర్విస్తున్నాడు. ఇక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి, ప్రస్తుతం వ్యాపారాలు చూసుకుంటాడు.

For More News: 

కరోనా అలెర్ట్: ఇంటర్ విద్యార్థులకు కీలక సూచనలు.. మాస్కులతో పరీక్షలు..

భార్యకు కరోనా సోకిందని బాత్‌రూమ్‌లో లాక్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.?

నాలుగు రోజుల్లో అల్లకల్లోలం.. కరోనాను జయించిన కేరళ విద్యార్థిని మనోగతం..

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు.?

టీ20 ప్రపంచకప్: తొలిసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా

కీచక ఆటోడ్రైవర్‌ను పట్టించిన దిశ యాప్.. మహిళ సేఫ్..

ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా పేషెంట్.. డాక్టర్లు పరేషాన్!

కేఎఫ్‌సీ చికెన్ కోసం కరోనా బాధితుల డిమాండ్..?