ఉగ్రవాదులకు షాక్.. భద్రతా దళాలకు భారీ విజయం..

బుధవారం తెల్లవారుజామున పుల్వామా ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఉగ్రవాదులకు భారీ షాక్‌ తగిలింది.

ఉగ్రవాదులకు షాక్.. భద్రతా దళాలకు భారీ విజయం..
Follow us

| Edited By:

Updated on: Jun 03, 2020 | 3:47 PM

ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. మన భారత సైన్యం మాత్రం.. ఓ వైపు కరోనాతో పోరాడుతూ.. మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేస్తున్నారు. తాజాగా బుధవారం తెల్లవారుజామున పుల్వామా ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఉగ్రవాదులకు భారీ షాక్‌ తగిలింది. ఈ సంఘటనలో జైషే మహ్మద్‌ చీఫ్ మసూద్‌ అజహర్‌ బంధువు ఒకరు హతమయ్యాడు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ పోలీస్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం పుల్వామా ప్రాంతంలోని కంగన్‌ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్‌లో జైషే టాప్ కమాండర్‌ ఫౌజీ బాబాను మట్టుబెట్టినట్లు స్పష్టం చేశారు. ఫౌజీ బాబా పాక్‌లోని ముల్తాన్‌కు చెందిన వాడు. ఇతడు ఐఈడీ మందుపాతరలు పెట్టి పేల్చడంలో స్పెషలిస్ట్‌ అన్నారు. ఇక ఇతడితో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. వీరిలో వలీద్ అనే వాంటెడ్ ఉగ్రవాది కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

కాగా, గతేడాది పుల్వామాలో జరిపినట్లుగా మరోసారి ఐఈడీ బ్లాస్ట్‌ చేద్దామనుకున్న ఉగ్రవాదుల ప్లాన్‌ను భారత సైన్యం తిప్పికొట్టింది. వారం రోజుల క్రితం ఓ కారులో 45 కిలోల పేలుడు పదార్ధాలతో సైన్యాన్ని టార్గెట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ట్రేస్ చేసిన సైన్యం.. భారీ పేలుడు పదార్ధాలతో వెళ్తున్న కారును సైన్యం వెంబడించింది. అంతేకాదు.. వారిపై కాల్పులు జరపడంతో.. ఆ ఉగ్రవాదులు కారును వదిలి పారిపోయారు. దీంతో ఆ కారును నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి పేల్చేసింది సైన్యం. ఈ క్రమంలో తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం.. సైన్యం లోయలో జల్లెడ పడుతుండగా.. బుధవారం నాడు ముగ్గురు హతమయ్యారు. వీరిలోనే మోస్ట్ వాంటెడ్‌ టెర్రరిస్టులు హతమవ్వడంతో.. భారత సైన్యం భారీ విజయం సాధించినట్లైంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు