కనిపిస్తే సుజనా సంగతి చూస్తాః  గోరంట్ల మాధవ్

|

Nov 22, 2019 | 11:11 PM

టీడీపీ నేతలు వైసీపీలోకి వలస వెళ్ళడానికి సిద్ధమయ్యారని ఏపీలో ప్రచారం జరుగుతుండగా.. అందరిని ఆశ్చర్యపరుస్తూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాత్రం కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు బీజేపీలో చేరడానికి వెంపర్లాడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద దుమారానికి దారి తీశాయి. ఇక సుజనా చౌదరి చేసిన కామెంట్స్‌పై వైసీపీ నేతలు తిరిగి కౌంటర్లు ఇస్తుంటే.. టీడీపీ నేతలు ఇందుకు విరుద్ధంగా లాజిక్కులు తీస్తూ.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు భుజం […]

కనిపిస్తే సుజనా సంగతి చూస్తాః  గోరంట్ల మాధవ్
Follow us on

టీడీపీ నేతలు వైసీపీలోకి వలస వెళ్ళడానికి సిద్ధమయ్యారని ఏపీలో ప్రచారం జరుగుతుండగా.. అందరిని ఆశ్చర్యపరుస్తూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాత్రం కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు బీజేపీలో చేరడానికి వెంపర్లాడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద దుమారానికి దారి తీశాయి.

ఇక సుజనా చౌదరి చేసిన కామెంట్స్‌పై వైసీపీ నేతలు తిరిగి కౌంటర్లు ఇస్తుంటే.. టీడీపీ నేతలు ఇందుకు విరుద్ధంగా లాజిక్కులు తీస్తూ.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు భుజం మీద ప్రధాని నరేంద్ర మోదీ చెయ్యి వేయడమే ఈ ఉలిక్కిపాటుకు కారణమా అని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌కు దారి తీసిన ఆపరేషన్ ఆకర్ష్‌పై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా చర్చ జరిగింది.

కనిపిస్తే సుజనా సంగతి చూస్తాః  గోరంట్ల మాధవ్

ఈ చర్చ నేపథ్యంలో ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు వట్టి అవాస్తవాలేనని ఆయన కొట్టి పారేశారు. తమ పార్టీ నేతలెవరూ కూడా బీజేపీతో టచ్‌లో లేరని.. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీజేపీ నేతలను కలుస్తామంటూ గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గతంలో హైవే నిధుల విషయంలో నేతలందరం కలిసే.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి దగ్గరకు వెళ్ళమని గుర్తు చేశారు. కాగా, సుజనా కనిపిస్తే.. తమ పార్టీ నేతలు ఎవరు బీజేపీతో టచ్‌లో ఉన్నారో చెప్పమని ఖచ్చితంగా అడుగుతానని గోరంట్ల మాధవ్ తెగేసి చెప్పారు.

జగన్ ది, నాది ఫెవికాల్ బంధంః రఘురామ్‌కృష్ణం రాజు

తాను బీజేపీ నాయకులతో రాజకీయంగా టచ్‌లో లేనని.. ఆ పార్టీలో తనకు స్నేహితులు ఉండటం వల్ల స్నేహపూర్వకంగానే అందరిని కలుస్తానని వైసీపీ ఎంపీ రఘురామ్‌కృష్ణం రాజు స్పష్టం చేశారు. సుజనా చౌదరి వ్యాఖ్యల్లో నిజం లేదని.. తనకు తెలుసున్నంత వరకు ఎవరూ కూడా బీజేపీతో టచ్‌లో లేరని ఆయన అన్నారు. తనకూ, సీఎం జగన్‌కు మధ్య బలమైన బంధం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సుజనా చౌదరి చేసిన కామెంట్స్, ఇంగ్లీష్ మీడియం అంశంపై ఇంకేం అన్నారో ఆయన మాటల్లోనే..

వైసీపీ, టీడీపీ చేపల కథః మాల్యాద్రి

వైసీపీ నేతలు ఉన్న నిజాన్ని దాచిపెడుతున్నారని.. రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ఆ విషయం అర్థమైందని టీడీపీ నేత మాల్యాద్రి అన్నారు. ఇంకా ఈ అంశాలపై ఏమన్నారో ఆయన మాటల్లోనే..