బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: 21 రోజుల్లో ఉరిశిక్ష సాధ్యమేనా?

నిర్భయ పేరుతో చట్టం తెచ్చినా నిందితులకు ఏడేళ్లయినా ఉరిశిక్ష పడలేదు. నిందితుల్లో ఒకరైన పవన్‌ వర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఉన్నావ్‌లో2017లో అత్యాచారం చేసిన ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ కేసు త్వరలో తీర్పు రాబోతోంది. 2018లో ఒక యువతిని రేప్‌చేసి, జైలుకెళ్లి బెయిల్‌మీద వచ్చిన ఐదుగురు నిందితులు ఆమెను సజీవ దహనం చేశారు. ఇప్పుడు వాళ్లు కటకటాల్లో ఉన్నారు. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: 21 రోజుల్లో ఉరిశిక్ష సాధ్యమేనా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 09, 2019 | 10:55 PM

నిర్భయ పేరుతో చట్టం తెచ్చినా నిందితులకు ఏడేళ్లయినా ఉరిశిక్ష పడలేదు. నిందితుల్లో ఒకరైన పవన్‌ వర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఉన్నావ్‌లో2017లో అత్యాచారం చేసిన ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ కేసు త్వరలో తీర్పు రాబోతోంది. 2018లో ఒక యువతిని రేప్‌చేసి, జైలుకెళ్లి బెయిల్‌మీద వచ్చిన ఐదుగురు నిందితులు ఆమెను సజీవ దహనం చేశారు. ఇప్పుడు వాళ్లు కటకటాల్లో ఉన్నారు. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడికి జిల్లా న్యాయస్థానం 42 రోజుల్లో మరణశిక్ష విధించింది. అయితే హైకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. ఈ పరిస్థితుల్లో ఏపీ సర్కార్‌ చెబుతున్నట్లు రేపిస్టులకు 21రోజుల్లో ఉరిశిక్ష సాధ్యమా?

దేశంలో అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదని ఒకవైపు ఆందోళన వ్యక్తం అవుతుంటే, ఏపీలో ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య యుద్దం నడుస్తోంది. రేపిస్టులకు సత్వర న్యాయం అన్న వాదన తెరపైకి వచ్చిన పరిస్థితుల్లో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక విప్లవాత్మక బిల్లును తీసుకురావడానికి సిద్ధమైంది. అత్యాచార ఘటనల్ని దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తోంది. అదే సందర్భంలో ఎన్‌కౌంటర్లపై దేశం రెండుగా చీలిపోయింది. రేపిస్టులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని దేశంలో సగం మందికిపైగా సమర్థిస్తున్నారు. మరికొందరు మాత్రం చంపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు, న్యాయస్థానాల పాత్ర మీద సమాజంలో చర్చ నడుస్తోంది. దిశ రేపిస్టుల ఎన్‌కౌంటర్‌ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం హైదరాబాద్‌లో పర్యటించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ బృందం ఇప్పటికే దిశ తల్లిదండ్రులను, కొందరు పోలీసు అధికారులను ప్రశ్నించింది.